సరిగ్గా 39 ఏళ్ల కిందట జరిగిన ఓ సంఘటన దేశ రాజకీయాలలో పెను మార్పులకు కేంద్రబిందువయ్యింది. ఓ ప్రధానమంత్రి హత్యకు దారి తీసింది. తదనంతరం నాలుగైదు వేల మంది సిక్కుల మరణానికి కారణమయ్యింది. ఎనిమిదో దశకంలో పంజాబ్‌లో కొందరు స్వతంత్ర దేశం కావాలంటూ ఆందోళన చేపట్టారు. అది ఖలిస్థాన్‌ ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమానికి జర్నయిల్ సింగ్‌ భింద్రన్‌ వాలే సారథ్యం వహించేవాడు. ఖలిస్తాన్‌ ఉద్యమం కారణంగా శాంతిభద్రతలు క్షీణించాయి.

సరిగ్గా 39 ఏళ్ల కిందట జరిగిన ఓ సంఘటన దేశ రాజకీయాలలో పెను మార్పులకు కేంద్రబిందువయ్యింది. ఓ ప్రధానమంత్రి హత్యకు దారి తీసింది. తదనంతరం నాలుగైదు వేల మంది సిక్కుల మరణానికి కారణమయ్యింది. ఎనిమిదో దశకంలో పంజాబ్‌లో కొందరు స్వతంత్ర దేశం కావాలంటూ ఆందోళన చేపట్టారు. అది ఖలిస్థాన్‌ ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమానికి జర్నయిల్ సింగ్‌ భింద్రన్‌ వాలే సారథ్యం వహించేవాడు. ఖలిస్తాన్‌ ఉద్యమం కారణంగా శాంతిభద్రతలు క్షీణించాయి. ఉద్యమ నేతలను అదుపులోకి తీసుకుందామంటే వారంతా పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో దాక్కుని ఉన్నారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు భారత సైన్యం చర్యలు చేపట్టింది. స్వర్ణ దేవాలయంలో అడుగుపెట్టింది. ఖలిస్తాన్‌ తీవ్రవాదులు, భారత సైన్యం మధ్య తుపాకులు పేలాయి. ఈ గొడవలో 83 మంది భారత సైనికులు అమరులయ్యారు. చాలా మంది ఖలిస్తాన్‌ వేర్పాటువాద చేతలు కూడా చనిపోయారు. భారత సైన్యం దీనికి ఆపరేషన్ బ్లూ స్టార్‌ అని పేరు పెట్టింది. సిక్కుల పవిత్ర స్థలమైన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని భింద్రన్‌వాలే స్థావరంగా చేసుకున్నాడు. తన అనుచరుల సాయంతో అక్కడి నుంచే పోలీసులపై దాడులు చేయించేవాడు. పంజాబ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దేవాలయం దగ్గర డీజీపీ స్థాయి అధికారిని ఖలిస్థాన్‌ తీవ్రవాదులు కాల్చి చంపారు. పరిస్థితులు రోజురోజుకి క్షీణించడం మొదలు పెట్టాయి. పంజాబ్‌ అంతటా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు చేజారే ప్రమాదం ఉండటంతో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. స్వర్ణమందిరంలో ఉన్న ఖలిస్తాన్‌ వేర్పాటువాదులను అదుపులోకి తీసుకోవాలని సైన్యానికి ఆదేశించారు. 1984, జూన్‌ 1వ తేదీన భారత సైన్యం చర్యలు మొదలు పెట్టింది. మేజర్‌ జనరల్‌ బ్రార్‌ నేతృత్వంలో కొనసాగిన ఈ చర్య భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆపరేషన్‌ను రాత్రిపూట చేపట్టాలని నిర్ణయించింది.

ఆపరేషన్‌ మెటల్‌, ఆపరేషన్‌ షాప్‌ అనే రెండు విభాగాల్లో చర్యలు చేపట్టింది సైన్యం. భింద్రన్‌వాలేతో పాటు అతడి అనుచరులని ఆలయం బయటకు తీసుకురావడానికి ఆపరేషన్‌ మెటల్‌ను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిలిటెంట్లను అణచివేసేందుకు ఆపరేషన్‌ షాప్‌ను అమలు చేసింది. స్వర్ణదేవాలయంలో రాత్రి పదిగంటల సమయంలో భారత సైన్యం ఆపరేషన్‌ మొదలుపెట్టింది. ఆపరేషన్‌ ముఖ్య ఉద్దేశంలో భింద్రన్‌వాలేతో పాటు అందులో దాక్కున్న వారిని బయటకు తేవడం. కానీ వేర్పాటువాదులు కూడా దాడులకు దిగారు. సైన్యంతో సరిసమానంగా వారి దగ్గర ఆయుధాలు ఉండటం ఆశ్చర్యం. చివరకు రాకెట్‌ లాంచర్లను కూడా ప్రయోగించారు. ఈ పరిణామాన్ని ఊహించని భారత సైన్యం ఎదురుదాడులకు దిగింది. జూన్‌ 1వ తేదీన మొదలైన ఈ అపరేషన్‌ 8వ తేదీ వరకు కొనసాగింది. ముందు జాగ్రత్తగా జూన్‌ 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. 5వ తేదీ రాత్రి కీలక ఆపరేషన్‌ను మొదలు పెట్టింది. మరుసటి రోజు ఉదయం వరకు ఆపరేషన్‌ కొనసాగింది. ఇందులో భింద్రన్‌వాలేతో పాటు చాలా మందిని సైన్యం చంపేసింది. ఈ ఆపరేషన్‌లో 83 మంది భారత సైనికులు చనిపోయారు. 236 మంది గాయపడ్డారు. 493 మంది ఖలిస్తాన్‌ తీవ్రవాదులు హతమయ్యారు. అమాయక ప్రజలు కూడా చనిపోవడం విషాదం. 500 మంది వేర్పాలువాదులను సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇది జరిగిన నాలుగు నెలలకు అంటే 1984, అక్టోబర్‌ 31న ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఆమెను చంపింది ఇద్దరు సిక్కు బాడీగార్డులు. ఇందిరాగాంధీ చనిపోయిన రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఢిల్లీ వణికిపోయింది. వేల మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు.

Updated On 6 Jun 2023 6:13 AM GMT
Ehatv

Ehatv

Next Story