అదేంటి.. రోడ్డు మీద ఉన్న గొయ్యి(Pathole) చనిపోయినవారిని ఎలా బతికించిందనుకుంటున్నారా.. మన దేశంలో గొయ్యిలో పడి చనిపోయాడనో, గాయాలయ్యాయనో వార్తలు వింటుంటాం. అంతేకానీ ఈ గొయ్యి ఏంటి.. మనిషిని బతికంచడమేంటి అనుకుంటున్నారా.. ఓ వ్యక్తిని చనిపోయాడని డాక్టర్లు (Doctors)ప్రకటించగా అంబులెన్స్‌లో తరలిస్తుండగా రోడ్డు మీద ఉన్న గోయ్యిలో నుంచి అంబులెన్స్‌ వెళ్లడంతో ఒక్కసారి కుదుపు వచ్చింది.

అదేంటి.. రోడ్డు మీద ఉన్న గొయ్యి(Pathole) చనిపోయినవారిని ఎలా బతికించిందనుకుంటున్నారా.. మన దేశంలో గొయ్యిలో పడి చనిపోయాడనో, గాయాలయ్యాయనో వార్తలు వింటుంటాం. అంతేకానీ ఈ గొయ్యి ఏంటి.. మనిషిని బతికంచడమేంటి అనుకుంటున్నారా.. ఓ వ్యక్తిని చనిపోయాడని డాక్టర్లు (Doctors)ప్రకటించగా అంబులెన్స్‌లో తరలిస్తుండగా రోడ్డు మీద ఉన్న గోయ్యిలో నుంచి అంబులెన్స్‌ వెళ్లడంతో ఒక్కసారి కుదుపు వచ్చింది. దీంతో చనిపోయాడనుకున్న వ్యక్తికి వెంటనే లేచాడు. హర్యానాలో (Haryana)ఈ ఘటన చోటుచేసుకుంది.

హర్యానాలోని కర్నల్‌ నివాసి 80 ఏళ్ల దర్శన్‌సింగ్‌ (Darshan singh)అనారోగ్యంతో పాటియాలో ఆస్పత్రిలో చేరాడు. నాలుగు రోజుల పాటు దర్శన్‌సింగ్‌కు వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందించారు. ఆ తర్వాత గురువారంనాడు దర్శన్‌సింగ్‌ చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. బంధుమిత్రులకు ఈ సంతాపవార్త తెలపడంతో ఊర్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతని మనవడు బల్వన్(Balwan).. దర్శన్‌సింగ్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌లో(Ambulance) తరలిస్తుండగా రోడ్డుపై ఉన్న గోతిలో నుంచి అంబెలెన్స్‌ వెళ్లింది. దీంతో ఒక్కసారి కుదుపురాగానే దర్శన్‌సింగ్‌లో కదలిక వచ్చింది. దీంతో దగ్గరలోని ఆస్పత్రికి హుటాహుటిన దర్శన్‌సింగ్‌ను తరలించారు.

Updated On 13 Jan 2024 3:57 AM GMT
Ehatv

Ehatv

Next Story