రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై(Brij Bhushan Sharan Singh) కేంద్ర ప్రభుత్వం ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ మహిళా రెజర్లు చెబుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం విచారకరం.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై(Brij Bhushan Sharan Singh) కేంద్ర ప్రభుత్వం ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ మహిళా రెజర్లు చెబుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం విచారకరం. బ్రిజ్ భూషణ్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల కేసు పెట్టారు. వీరిలో ఓ మైనర్ కూడా ఉంది.
ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను ఆ మైనర్‌కు అంకుల్‌నంటూ ఓ వీడియో విడుదల చేశాడు. అందరూ అనుకున్నట్టుగా ఆమె మైనర్ కాదని, ఆమెకు 20 ఏళ్ల వయసు ఉంటుందని చెబుతూ కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. దీనిపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్(Swathi Maliwal) ఆ వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. చట్టవిరుద్ధ చర్యకు పాల్పడిన అతడిపై పోక్సో చట్ట ప్రకారం ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేయాలని పోలీసులకు నోటీస్ జారీ చేశారు. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ఆయన బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని స్వాతి మలివాల్ అన్నారు.
భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా మొదలైన అగ్రశ్రేణి రెజ్లర్లు కొన్ని రోజులుగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో నిరసన చేస్తున్నారు. వారికి ప్రజలు మద్దతుగా నిలిచారు. కొందరే క్రీడాకారులు వారి నిరసనకు మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. వారు అంతర్జాతీయ వేదికల మీద పతకాలు గెల్చినప్పుడు అభినందనలు తెలపడానికి పోటీపడ్డ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వారు ఇప్పుడు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఇంకా చాలా మంది సెలెబ్రిటీలు ప్రభుత్వానికి జడిసి ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారు.
మొన్న ఆదివారం పార్లమెంట్(Pariliament) నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కఠినంగా, దారుణంగా, అమానుషంగా ప్రవర్తించారు. ఈ దృశ్యాలను చూసి చాలా మంది కలత చెందారు. కొందరు కన్నీరు కార్చారు. అయినా గోది మీడియాకు మాత్రం ఈ వార్తను కవర్ చేయాలని అనిపించలేదు. ప్రభుత్వం నుంచి కొంచెం కూడా స్పందన రాకపోవడంతో తాము సాధించిన పతకాలను గంగలో నిమజ్జనం చేస్తామని హరిద్వార్ బయలుదేరారు. రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ వారి మనసు మార్చారు. వారి ప్రయత్నాన్ని విరమింపచేశారు. మరోవైపు భారత రెజ్లర్లపై పోలీసుల చర్యను ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఖండించింది. విచారం వ్యక్తం చేసింది.