మోసపోయే వాళ్లున్నంత వరకు మోసం చేసేవాడు పుట్టుకొస్తాడన్నట్లు అన్న సామెతను రుజువు చేసేలా సమాజంలో రోజుకో మోసం బయటపడుతునే ఉంటుంది.

మోసపోయే వాళ్లున్నంత వరకు మోసం చేసేవాడు పుట్టుకొస్తాడన్నట్లు అన్న సామెతను రుజువు చేసేలా సమాజంలో రోజుకో మోసం బయటపడుతునే ఉంటుంది. మన బలహీనతలే వారికి ఆయుధాలై వాటితోనే మనల్ని పొడుస్తారు. ఈ తరహా మోసం ఒకటి ఇప్పుడు కొత్తగా బయటపడుతోంది. అదే డేటింగ్ యాప్(Dating app). ఈ యాప్‌లో పేర్లు నమోదు చేసుకొని ముక్కు, మొహం తెలియని వ్యక్తులతో చాటింగ్(chatting) చేస్తుంటారు. డేటింగ్‌ యాప్‌లో పరిచయం పెంచుకొని డిన్నర్‌కు(Dinner) పిలుస్తారు. ఆ ఉచ్చులో పడి మనం కేటుగాళ్లు చెప్పిన చోటుకు వెళ్తే జేబుకు పెద్ద బొక్క పడడం ఖాయం.

హైదరాబాద్‌కు(Hyderabad) ఢిల్లీ(Delhi) నుంచి ఓ ముఠా దిగింది. ఈ ముఠా నష్టాల్లో ఉన్న పబ్‌లను గుర్తించి వారిని అప్రోచ్‌ అయ్యి నష్టాల్లో ఉన్న మీ పబ్‌లను లాభాల్లోకి తీసుకొస్తామని చెప్తారు. పబ్‌ మేనేజర్లతో డీల్‌ సెట్‌ చేసుకుంటారు. డేటింగ్ యాప్‌లో చాటింగ్ చేస్తున్న యువకులను టార్గెట్ చేసుకుంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిల ఫోటోలను డేటింగ్ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అమ్మాయిల పేరుతో ఈ ముఠా యువకులతో చేస్తుంది. పరిచయమైన ఒకటి, రెండు రోజుల్లోనే డిన్నర్‌కు కలుద్దామని అప్పటికే ఎంచుకున్న పబ్‌ పేరు చెప్తారు. డిన్నర్ కోసం బయటికి వచ్చిన తర్వాత వీరు చెప్పిన అడ్రస్‌కు రావాలని మెసేజ్ చేస్తారు. అక్కడి నుంచి పబ్బులోకి తీసుకెళ్లి డ్రింక్స్ ఆర్డర్‌ చేస్తారు. తన పక్కనే ఓ అమ్మాయి ఉండడం, ఆమె పలానా డ్రింక్‌ అని కోరడంతో ఇష్టానుసారంగా మద్యం ఆర్డర్‌ చేస్తాడు బాధితుడు. అమ్మాయిలకు వచ్చే డ్రింక్స్‌లో మార్పులు చేసి, ఆర్డర్‌ ఇచ్చిన మద్యం కాకుండా తక్కువ ధర ఉండే డ్రింక్స్‌ సర్వ్‌చేస్తారు. కానీ తొలుత ఆర్డర్‌ చేసిన డ్రింక్స్‌కే బిల్లు వస్తుంది. బిల్లును చూసి బాధితులు ఒక్కసారిగా షాక్‌ అవుతారు. మెల్లగా అక్కడి నుంచి ఆ అమ్మాయి జారుకుంటుంది.

ఇటీవలే హైదరాబాద్‌లో మోషి పబ్బులో ఇలాంటి తరహాలో మోసపోయిన ఓ వ్యాపారవేత్త దీనిని బహిరంగంగా చెప్పాడు. ఇలాంటి ముఠా చేతిలో మోసపోకూడదని ఆయన సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. చాలామంది కస్టమర్లు మోసపోయినప్పటికీ బహిరంగంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. కానీ గూగుల్ రివ్యూస్‌లో మాత్రం వీరి చేదు అనుభవాన్ని మాత్రం పంచుకున్నారు. పబ్బులో ఉన్న మెనూ కాకుండా సపరేట్ మెను ఈ నెల రోజుల కోసం తయారుచేస్తారు. నెల రోజుల్లోనే తాము రాబట్టాల్సిన డబ్బు మొత్తాన్ని కస్టమర్ల నుంచి రాబడతామని ఈ ముఠా హామీ ఇస్తుంది. రాబట్టేందుకు ప్లాన్ చేశారు. ఈ ముఠా చేతిలో దాదాపు 50 మంది మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులను ట్రాప్ చేసి, పబ్బు వరకు రప్పించి వారిచేతనే లక్షల్లో బిల్లు కట్టించారు. డ్రింక్స్ ఆర్డర్ చేసిన వెంటనే ఇదే ముఠాలో ఉన్న సభ్యులు వెయిటర్‌గా సర్వీస్ బాయ్‌గా, మేనేజర్లుగా అవతారం ఎత్తి తమ ప్లాన్‌ను చక్కగా ఎక్జిక్యూట్‌ చేస్తారు. ఇవేవీ తెలియని బాధితులు ఒక్కసారిగా బిల్లు చేతిలో పెట్టడంతో షాక్‌ తిన్నారు. ఓనర్లకు తెలియకుండా పనిచేసే మేనేజర్ డిల్లీ ముఠా సభ్యులతో చేతులు కలిపి ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మోసానికి పాల్పడుతున్న పబ్‌ మేనేజర్‌ సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. విచారణలో నిందితులు ఢిల్లీకి చెందినవారుగా గుర్తించారు పోలీసులు.

Eha Tv

Eha Tv

Next Story