సాధారణంగా స్కూల్‌(School) పాఠ్యాంశాల్లో స్వాతంత్ర్య సమరయోధులు (Freedom Fighters), సంఘ సంస్కర్తలు, సమాజ సేవ(Social service) చేసినవారి గురించి పాఠాలు ఉంటాయి. కానీ సీబీఎస్‌ఈ(CBSE) సిలబస్‌ అందుకు భిన్నంగా ఉంది. 9వ తరగతి సిలబస్‌లో డేటింగ్(Dating), రిలేషన్‌షిపలను(Relationship) చేర్చారు. 9వ తరగతి పాఠ్యపుస్తకం ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది.

సాధారణంగా స్కూల్‌(School) పాఠ్యాంశాల్లో స్వాతంత్ర్య సమరయోధులు (Freedom Fighters), సంఘ సంస్కర్తలు, సమాజ సేవ(Social service) చేసినవారి గురించి పాఠాలు ఉంటాయి. కానీ సీబీఎస్‌ఈ(CBSE) సిలబస్‌ అందుకు భిన్నంగా ఉంది. 9వ తరగతి సిలబస్‌లో డేటింగ్(Dating), రిలేషన్‌షిపలను(Relationship) చేర్చారు. 9వ తరగతి పాఠ్యపుస్తకం ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. దీనిని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు(Parents) ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. ఇంత చిన్న వయసులో డేటింగ్‌, రిలేషన్‌షిప్‌ గురించి పాఠాలను ఎలా చేరుస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్‌ మీడియాలో(Social Media) వైరలవుతున్నాయి. పాఠశాల సిలబస్‌లో ఈ అంశాలను చేర్చడం సోషల్ మీడియా వినియోగదారులలో వినోదాన్ని రేకెత్తించింది. అయితే దీనిపై కొందరు సీరియస్‌గా(Serious) రియాక్టవుతున్నారు. స్కూల్లో డేటింగ్, రిలేషన్‌షిప్‌పై పాఠాలు చేర్చితే.. ఇక పై తరగతుల్లో బ్రేకప్‌లను(Breakups) ఎలా డీల్‌ చేయాలో చేర్చుతారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై అధికారులు ఇంతవరకు స్పందించలేదు. నిజంగానే ఈ సిలబస్‌ను చేర్చారా లేదా ఇది ఆకతాయిల పనా అన్నది అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Updated On 2 Feb 2024 6:55 AM GMT
Ehatv

Ehatv

Next Story