మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జనకు(urination) పాల్పడిన ఘటనపై దేశం యావత్తూ భగ్గుమనడంతో నిందితుడు ప్రవేశ్ శుక్లాను(Pravesh shukla) పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ(BJP) ఎమ్మెల్యే(MLA) కేదార్‌నాథ్ శుక్లాకు(Kedharnath Shukla) నిందితుడు ముఖ్య అనుచరుడు కాబట్టి పోలీసులు ఆడిన డ్రామాను కూడా దేశం చూసింది.

Dashmat Rawat Revelation
మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జనకు(urination) పాల్పడిన ఘటనపై దేశం యావత్తూ భగ్గుమనడంతో నిందితుడు ప్రవేశ్ శుక్లాను(Pravesh shukla) పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ(BJP) ఎమ్మెల్యే(MLA) కేదార్‌నాథ్ శుక్లాకు(Kedharnath Shukla) నిందితుడు ముఖ్య అనుచరుడు కాబట్టి పోలీసులు ఆడిన డ్రామాను కూడా దేశం చూసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ మచ్చ నుంచి బయటపడేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chauhan) బాధితుడిని తన నివాసానికి పిలిపించుకున్నారు. స్వయంగా అతడి కాళ్లు కడిగారు. క్షమాపణ కోరారు. భోజనం పెట్టారు. కొత్త బట్టలు ఇచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు మీడియాలో వచ్చాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడే ఈ నాటకం కొత్త మలుపు తిరిగింది. తాను అసలైన బాధితుడిని కాదని, ఆ వీడియలో ఉన్న వ్యక్తిని తాను కాదని సీఎంతో కాళ్లు కడిగించుకున్న దశమత్ రావత్(Dashmat Rawat) పేర్కొనడంతో బీజేపీ గొంతులు వెలక్కాయ పడింది. నిందితుడు ప్రవేశ్ శుక్లా తనతో బలవంతంగా సంతకం చేయించారని దశమత్ పేర్కొనడం గమనార్హం. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నిజమైన బాధితుడి కాళ్లు కడగకుండా గొప్ప నాటకమాడారని కాంగ్రెస్(Congress) విమర్శిస్తోంది..
