Dangno Paper Company : ఫిట్నెస్ ఉంటేనే పూర్తి బోనస్..!
సాధారణంగా ఉద్యోగులకు(Employees) ఇంక్రిమెంట్లు(Increment), ప్రమోషన్లు, బోనస్‌లు ఇవ్వాలని కంపెనీల యాజమాన్యాలు.. ఉద్యోగుల ఫర్మార్మెన్స్.. వారి పనితీరును బట్టి గ్రేడింగ్‌లు ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే ఓ కంపెనీ మాత్రం బోనస్(Bonus) పొందాలంటే ఏం చేయాలనేదానిపై వింత కండీషన్ పెట్టింది. ఉద్యోగులు నెలలో 50 కి.మీ.రన్నింగ్(Running) చేస్తేనే బోనస్ పొందుతారని ఉద్యోగులకు షరతు విధించింది. ఆ కంపెనీ ఏంటో, ఎక్కడ ఉందో చూద్దాం..!

చైనాలోని(China) గౌంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని(Guangdong Province) డాంగ్నో పేపర్ కంపెనీ(Dangno Paper Company) ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఎంత రన్నింగ్ చేస్తే అంత బోనస్ లభిస్తుందని ప్రకటించింది. నెలవారీ రివార్డ్ సిస్టం తీసుకొచ్చింది. తమ ఉద్యోగులను ఫిట్‌గా(Fit) ఉంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. నెలవారీగా వారు రన్నింగ్ చేసే దూరాన్ని(Distance) లెక్కించి బోనస్ ఇస్తామని తెలిపింది. ఈ పాలసీ ప్రకారం నెలకు 50 కి.మీ.పరిగెత్తిన ఉద్యోగులకు ఫుల్ బోనస్ వస్తుంది. లేదా నెలకు 40 కి.మీ. సరిపెట్టుకుంటే 60 శాతం బోనస్.. 30 కి.మీ. పరిగెత్తితే వారికి కేవలం 30 శాతం బోనసే వస్తుందని షరతులు విధించింది. మరో బంపర్ ఆఫర్‌ను కూడా ఈ కంపెనీ ప్రకటించింది. నెలకు 100 కి.మీ. పరిగెడితే అదనంగా మరో 30 శాతం వస్తుందని ప్రకటించింది. ఉద్యోగులు తమ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ల ద్వారా వారు నడిచిన, పరిగెత్తిన దూరాన్ని ఆ కంపెనే లెక్కిస్తుంది. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే కంపెనీ మనుగడ ఎక్కువ కాలం ఉంటుందని గౌంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని డాంగ్నో పేపర్ చైర్మన్ లిన్ ఝింయాంగ్ భావించడమే ఇ షరతులకు కారణమట.