జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(MP Prajwal Revanna) జర్మనీకి పారిపోయాడు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న రేవణ్ణ నిన్న పొద్దున్నే జర్మనీకి పరారయ్యాడు. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి.

MP Prajwal Revanna
జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(MP Prajwal Revanna) జర్మనీకి పారిపోయాడు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న రేవణ్ణ నిన్న పొద్దున్నే జర్మనీకి పరారయ్యాడు. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీసు స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు చెప్పారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్ బృందానికి సమాచారం అందించారు. రేవణ్ణపై మరికొందరు మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు రాబోతున్నారు. తనపై వస్తున్న ఆరోపణలు ప్రజ్వల్ ఖండించారు. ఆశ్లీల వీడియోలు మార్ఫింగ్ చేసినవి అంటూ ఉల్టా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేసినవాడు తనపై వచ్చిన ఆరోపణలు అసత్యాలని రుజువు చేసుకోకుండా నిన్న ఉదయం జర్మనీకి చెక్కేశాడు. ప్రజ్వల్ రేవణ్ణ ఎన్డీయే అభ్యర్థి కాబట్టి బీజేపీ(BJP) కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. జాతీయ మీడియా కూడా మౌనంగా ఉంది.
