మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) శివపురి(Shivapuri) జిల్లాలో నీటి వివాదంలో నారద్ జాతవ్(Narad jaathav) అనే 27 ఏళ్ల దళిత యువకుడిని దారుణంగా కొట్టి చంపారు.
మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) శివపురి(Shivapuri) జిల్లాలో నీటి వివాదంలో నారద్ జాతవ్(Narad jaathav) అనే 27 ఏళ్ల దళిత యువకుడిని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో(social media) విపరీతంగా వ్యాపించింది. తన మేనత్త గ్రామమైన ఇందర్‌ఘర్‌ను సందర్శించిన బాధితుడిపై గ్రామ సర్పంచ్ పదమ్ సింగ్ ధాకర్, అతని కుటుంబ సభ్యులతో సహా కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. నవంబర్ 26న జరిగిన ఈ దాడికి బోర్‌వెల్ నుంచి నీరు వచ్చే విషయంలో తలెత్తిన విభేదాలే కారణమని ఆరోపించారు. గ్రామ సర్పంచ్‌తో సహా ఎనిమిది మంది వ్యక్తులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కుల వివక్ష, హింసను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. శివపురిలో నారద్ జాతవ్ అనే దళిత యువకుడిని సర్పంచ్ కుటుంబం కర్రలతో దారుణంగా కొట్టి చంపారని.. కాంగ్రెస్ ఆరోపించింది.