పాపం అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను పూజారులు, ఆలయ సిబ్బంది కర్రలతో చితకబాదారు. వారి దెబ్బల నుంచి తప్పించుకోవడానికి భక్తులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) హరిద్వార్‌లో(Haridwar) జరిగిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది.

Dakshina Kali Mandir
పాపం అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను పూజారులు, ఆలయ సిబ్బంది కర్రలతో చితకబాదారు. వారి దెబ్బల నుంచి తప్పించుకోవడానికి భక్తులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) హరిద్వార్‌లో(Haridwar) జరిగిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) సహరన్‌పూర్‌కు చెందిన కొందరు వ్యక్తులు, సిద్ధపీఠ్‌లోని దక్షిణ కాళీ మందిర్‌కు(Dakshina Kali Mandir) వచ్చారు. వారంత బైక్‌లపై వచ్చారు. ఆలయంలో పార్కింగ్(Parking) అంశంపై గొడవ మొదలయ్యింది. ఆ గొడవ కాస్త ముదిరి ఘర్షణకు దారి తీసింది. దీంతో పూజారులు, ఆలయ సిబ్బంది కలిసి ఆ భక్తులపై దాడికి దిగారు. కర్రలు పుచ్చుకుని చితకబాదారు. దాడి నుంచి తప్పించుకోవడానికి భక్తులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఆలయం దగ్గరలోంచి వాహనాలపై వెళుతున్న వారు కూడా ఈ ఘర్షణ వల్ల ఇబ్బంది పడ్డారు. అయితే ఈ కొట్లాటకు సంబంధించి ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు.
