సంకల్పం, తపన ఉంటే తాను ఎదిగేందుకు పేదరికం, చదువు అడ్డురాదని నిరూపించి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు దాదాసాహెబ్ భగత్(Dadasaheb Bhagat) అనే వ్యక్తి. మహారాష్ట్రలోని బీడ్(Beed) అనే మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన భగత్ నేడు రెండు స్టార్టప్ కంపెనీలకు(Startup Companies) అధినేతగా ఎదిగాడు. తమ తల్లిదండ్రులు చెరుకుతోటలో(Sugar cane) ఆరు నెలలపాటు కూలీ పనులకు వెళ్లేవారు. తాను కూడా అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తుండేవాడు.
సంకల్పం, తపన ఉంటే తాను ఎదిగేందుకు పేదరికం, చదువు అడ్డురాదని నిరూపించి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు దాదాసాహెబ్ భగత్(Dadasaheb Bhagat) అనే వ్యక్తి. మహారాష్ట్రలోని బీడ్(Beed) అనే మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన భగత్ నేడు రెండు స్టార్టప్ కంపెనీలకు(Startup Companies) అధినేతగా ఎదిగాడు. తమ తల్లిదండ్రులు చెరుకుతోటలో(Sugar cane) ఆరు నెలలపాటు కూలీ పనులకు వెళ్లేవారు. తాను కూడా అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తుండేవాడు. స్వగ్రామం బీడ్‌లో స్కూల్ విద్యాభ్యాసం తర్వాత పుణె వెళ్లి ఐటీఐ(ITI) కోర్సు చేశాడు. ఇన్ఫోసిస్(Infosys) గెస్ట్ హౌస్‌లో ఆఫీస్ బాయ్‌గా(Office Boy) నెలకు రూ.9 వేల జీతానికి చేరాడు. ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌కు వచ్చే అతిథులకు టీలు, కాఫీలు అందించి సపర్యలు చేశాడు. ఐటీ ఉద్యోగులను చూసి తాను కూడా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. సాఫ్ట్‌వేర్ రంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. దీంతో తన కలను నెరవేర్చుకోడానికి రాత్రిపూట యానిమేషన్(Animation) సెంటర్‌లో గ్రాఫిక్స్ డిజైనింగ్, యానిమేషన్ కోర్సు నేర్చుకున్నాడు. అక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాడు. హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో CPP, పైథాన్(Python) కోర్సు నేర్చుకున్నాడు.
ఆ తర్వాత ఆన్‌లైన్‌లో డిజైన్ టెంప్లెట్లను విక్రయించడం ప్రారంభించాడు. డిజైన్ టెంప్లెట్లను విక్రయిస్తూ ఉద్యోగంతో సంపాదించే డబ్బుకన్నా అధికంగా సంపాదించడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో అతను రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బెడ్ రెస్ట్ తీసుకుంటూనే డిజైన్ టెంప్లెట్లను అమ్ముకుంటూ సంపద సృష్టించాడు. ఆ తర్వాత 2015లో నింత్‌మోషన్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. కొద్ది కాలానికే అతనికి 9 వేల మంది కస్టమర్లు వచ్చారు. లాక్‌డౌన్ సమయంలో అతను సొంత ఊరికి వెళ్లి పశువుల పాకలో టెంపరరీ ఆఫీస్‌ను ప్రారంభించాడు. 4G కనెక్టివిటీతో తన కార్యకలాపాలు కొనసాగించాడు.
అంతేకాకుండో మరో కంపెనీ డూగ్రాఫిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రారంభించి లక్షల సంపాదనను ఆర్జించసాగాడు.
26 సెప్టెంబర్ 2020న ప్రధాని మోదీ(PM Modi) కూడా దాదాసాహెబ్ భగత్ పనితీరును, అతని అంకితభావాన్ని ‘మన్ కీ బాత్’ (Man Ki Bath)కార్యక్రమంలో ప్రశంసించారు. అతిసాధారణ కుటుంబం నుంచి వచ్చిన భగత్.. రెండు స్టార్టప్ కంపెనీలకు అధిపతి అయ్యి కోట్లు ఆర్జిస్తున్నాడు.