మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly Elections) జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అందరూ తమదే విజయమని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(D. K. Shivakumar) ఎన్నికలలో 140 సీట్లకు పైగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుకుపడ్డారు.
మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly Elections) జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అందరూ తమదే విజయమని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(D. K. Shivakumar) ఎన్నికలలో 140 సీట్లకు పైగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతివ్వడం ద్వారా యావత్ దేశానికి సందేశం పంపుతారని శివకుమార్ అన్నారు.
కర్ణాటక శాసనసభలోని మొత్తం 224 స్థానాలకు మే 10న ఓటింగ్ జరుగనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోపై డీకే శివకుమార్ విమర్శలు గుప్పించారు. ప్రగతిశీల, అభివృద్ధి ఆధారిత ఎజెండాతో కాంగ్రెస్ పోటీ చేస్తున్నందున ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 'మోడీ ఫ్యాక్టర్' పనిచేయదని శివకుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి రేసులో సిద్ధరామయ్యకు పోటీగా ఉన్న శివకుమార్.. ప్రస్తుతానికి పార్టీ విజయమే తమ ముందున్న లక్ష్యమన్నారు. నాకు పార్టీ ముందు అని.. ముఖ్యమంత్రి పదవి ఆ తర్వాత వస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదిస్తామన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌లో విభేదాలు ఉన్నాయని వచ్చిన వార్తలను శివకుమార్ ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం ఏకతాటిపై ఉందని, కార్యకర్తలు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడానికి మా సమిష్టి కృషి దోహదపడుతుందన్నారు.
గత మూడేళ్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ కష్టపడి పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో 'భారత్ జోడో యాత్ర'(Bharat Jodo Yatra) చాలా విజయవంతమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 141 సీట్లు వస్తాయని, బీజేపీ 60 సీట్ల కంటే తక్కువకు దిగజారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో చాలా సునాయాసంగా గెలుస్తున్నామని జోష్యం చెప్పారు. ఈ విజయం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మార్గం సుగమం చేస్తుంది. కర్ణాటక ప్రజలు దేశానికి సందేశం ఇస్తారని అన్నారు.