కొత్తగా విడుదలైన సినిమా, వెబ్‌ సిరీస్‌(Web Series) చూడాలంటే టెలిగ్రాంకు(Telegram) వెళ్తున్నవారిని కేంద్రం హెచ్చరించింది. కొత్త సినిమాలు చూసేందుకు టెలిగ్రాం యాప్‌ను ఆశ్రయిస్తున్నవారికి కేంద్ర హోంశాఖలో ఉన్న సైబర్‌(Cyber) దోస్త్‌ హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాం అంటే ఓటీటీలో విడుదల కాగానే సబ్‌స్క్రిప్షన్‌ లేకపోయినా వెంటనే టెలిగ్రాంలోని పలు గ్రూపుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి.

ఈ ఫేక్‌ లింక్‌ల(Fake Links) గురించి తెలియక కొత్త సినిమాలు చూడాలన్న ఉత్సాహంతో టెలిగ్రాం గ్రూపుల్లో చేరుతున్నారు. ఐబొమ్మ(Ibomma), టెలిగ్రాం వంటి వాటిల్లో కొత్త సినిమాలకు థంబ్‌నైల్స్‌ పెట్టి సైబర్‌ లింకులను పంపిస్తున్నారు. ఆ లింక్స్‌ను క్లిక్‌ చేసిన వెంటనే సైబర్‌ కేటుగాళ్లకు మన సమాచారం వెళ్తుంది. మన పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాప్‌ చేసి, డబ్బులు దోచేస్తున్నట్లు సైబర్‌ దోస్త్‌ గుర్తించింది. ఇలాంటి మోసాలు టెలిగ్రాం యాప్‌లో ఎక్కువగా జరుగుతున్నట్టు తెలిపింది. తెలియని లింక్‌లను క్లిక్‌ చేసి, డబ్బులు పోగొట్టుకోవద్దని సైబర్‌ దోస్త్‌ సూచిస్తోంది. టెలిగ్రాం ద్వారా ఇచ్చే లింక్‌ల నుంచి ఎలాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని.. అవి మన భద్రతకు, బ్యాంక్‌ అకౌంట్ల రక్షణకు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు.

Updated On 29 Dec 2023 4:13 AM GMT
Ehatv

Ehatv

Next Story