రోజులు మారాయి.. మునుపటిలా ఇప్పుడు పంజరంలో పక్షులను బంధిస్తే మనం బందిఖానాలోకి వెళ్లాల్సి వస్తుంది. పాపం చిలక జోస్యం(Parrot Astrology) చెప్పుకునే వారు తగ్గిపోయింది ఈ కారణంతోనే! ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే.. తమిళనాడులోని(Tamil Nadu) కడలూరుకు చెందిన అన్నదమ్ములిద్దరు చిలకజోస్యం చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
రోజులు మారాయి.. మునుపటిలా ఇప్పుడు పంజరంలో పక్షులను బంధిస్తే మనం బందిఖానాలోకి వెళ్లాల్సి వస్తుంది. పాపం చిలక జోస్యం(Parrot Astrology) చెప్పుకునే వారు తగ్గిపోయింది ఈ కారణంతోనే! ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే.. తమిళనాడులోని(Tamil Nadu) కడలూరుకు చెందిన అన్నదమ్ములిద్దరు చిలకజోస్యం చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కడలూర్(Cuddalore) లోక్‌సభ నియోజకవర్గం నుంచి పీఎంకే తరఫున బరిలో దిగిన థంకూర్ బచ్చర్(Thankar Bachan) ప్రచారం చేసుకుంటూ ఆ వైపుగా వచ్చారు. చిలకజోస్యం చెబుతున్న వారి దగ్గరకు వెళ్లి జోస్యం చెప్పించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో థంకూర్ బచ్చన్ గెలవడం ఖాయమని, చిలుక తీసిన కార్డులో అది స్పష్టమయ్యిందని చిలుక జోతిష్యులు చెప్పారు. వారి మాటలతో బచ్చన్ సంతృప్తి చెంది డబ్బులిచ్చి వెళ్లిపోయారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. వారొచ్చి అన్నదమ్ములిద్దరిని అరెస్ట్ చేశారు. చిలుకలను బోనులో బంధించిన కారణంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం తాము జ్యోతిష్కులను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. కానీ బచ్చన్‌కు మాత్రం ఇది నచ్చలేదు. తన విజయ వార్తను అధికార డీఎంకే నేతలు ఓర్వలేకపోతున్నారని, అందుకే అరెస్ట్ చేశానని అంటున్నారు. స్టాలిన్ సర్కారు సామాన్యులను వేధిస్తున్నదని బచ్చన్ విమర్శించారు.