Jammu Kashmir : కశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయిన తీవ్రవాదులు
జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్‌పీఎఫ్ అధికారి మరణించారు.
జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్‌పీఎఫ్ అధికారి మరణించారు. CRPF బెటాలియన్‌ను మోహరించడానికి సిద్ధం అవుతున్న సమయంలో.. తనిఖీ చేయడానికి CRPF ఇన్‌స్పెక్టర్ తన బృందానికి నాయకత్వం వహించాడు. ఈ క్రమంలో వారిపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. CRPF అధికారికి శత్రువుల బుల్లెట్ తగలడంతో మరణించినట్లు సంబంధిత వర్గాలు ధృవీకరించాయి. దాడి జరిగిన పోస్ట్ ఉధంపూర్‌లోని డూడు ప్రాంతంలోని పోలీసు పోస్ట్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. జమ్మూలోని కొండ ప్రాంతాలలో కొత్త యాంటీ టెర్రర్ స్టెప్స్‌లో భాగంగా ఈ పోస్ట్ ఏర్పాటు చేశారు.
జమ్మూ ప్రాంతంలో ఇటీవలి నెలల్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. జూలైలో, దోడా జిల్లాలో సాయుధ ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీసు సిబ్బంది మరణించారు. పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఇఎం) షాడో గ్రూప్ 'కశ్మీర్ టైగర్స్' ఈ దాడికి పాల్పడింది. జూలై 8న, కతువా జిల్లాలోని పర్వత రహదారిపై ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు.