సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra) ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యింది. మంచు రూపంలో వెలిసిన శివలింగాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. ఈ సుప్రసిద్ధ యాత్రం ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. భద్రతా దళాలను కట్టుదిట్టం చేశారు.
సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra) ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యింది. మంచు రూపంలో వెలిసిన శివలింగాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. ఈ సుప్రసిద్ధ యాత్రం ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. భద్రతా దళాలను కట్టుదిట్టం చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ పుణ్యక్షేత్రంలో భర్తులు మంచుతో కూడిన శివలింగాన్ని దర్శించుకోనున్నారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న భక్తులు రెండు మార్గాల ద్వారా అమర్‌నాథ్ గుహకు చేరుకోనున్నారు. మొదటి మార్గంలో యాత్రికులు షెహల్గావ్ నుంచి పంచతరుణికి వెళ్లి, అక్కడి నుంచి అమర్‌నాథ్ గుహకు చేరుకుంటారు. రెండో మార్గంలో వెళ్లే భక్తులు శ్రీనగర్ నుంచి బాల్తాల్‌కు చేరుకుని అక్కడ నుంచి సుమారు 14 కిలోమీటర్లు ప్రయాణించి మంచు లింగాన్ని దర్శించుకుంటారు. అమర్‌నాథ్ యాత్రకు ఎలాంటి విఘాతం కలగకుండా ఐటీబీపీ(CRPF) దళాలు భారీ భద్రతను కల్పిస్తున్నాయి. మూడు లక్షల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.