జంతువులకు సేవ చేస్తే మంచి జరుగుతుందని గుజరాత్‌లోని మెహసానా జిల్లా పంచోత్ గ్రామ ప్రజల నమ్మకం. ఆ విశ్వాసం తోనే వీధికుక్కల సంక్షేమం కోసం ట్రస్టును ఏర్పాటు చేశారు.ఆ ట్రస్టు పేరిట కొందరు కోట్ల రూపాయల విలువైన తమ భూమిని రాసుకున్నారు. అంతే కాకుండా గ్రామంలోని రైతులకు కౌలుకు భూములు ఇస్తున్నారు. ఆ అద్దె ద్వారా వచ్చే ఆదాయాన్ని కుక్కల మేత, సంక్షేమానికి కూడా వినియోగిస్తున్నారు.
మనిషి జీవితం దుర్బరమైనప్పుడు సాధారణంగా కుక్క బ్రతుకుతో పోలుస్తాం. కానీ ఆ ఊర్లో మాత్రం వీధికుక్కలకి కూడా కోట్లల్లో ఆస్తులున్నాయి. ఇదేంటి సాధారణంగా విదేశాల్లో కొన్ని పెంపుడు కుక్కలు, పిల్లుల పేరిట కోట్లాది రూపాయల ఆస్తులున్నాయని వింటుంటాం కదా, వీధి కుక్కలకి కోట్ల ఆస్తులెంటే అని ఆర్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే.
జంతువులకు సేవ చేస్తే మంచి జరుగుతుందని గుజరాత్‌లోని మెహసానా జిల్లా పంచోత్ గ్రామ ప్రజల నమ్మకం. ఆ విశ్వాసం తోనే వీధికుక్కల సంక్షేమం కోసం ట్రస్టును ఏర్పాటు చేశారు.ఆ ట్రస్టు పేరిట కొందరు కోట్ల రూపాయల విలువైన తమ భూమిని రాసుకున్నారు. అంతే కాకుండా గ్రామంలోని రైతులకు కౌలుకు భూములు ఇస్తున్నారు. ఆ అద్దె ద్వారా వచ్చే ఆదాయాన్ని కుక్కల మేత, సంక్షేమానికి కూడా వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం ఈ డాగ్ ట్రస్ట్ పేరిట పదెకరాల భూమి ఉంది. ఆ భూమి విలువ 90 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అందుకే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ కుక్కలను కోటీశ్వరులు అని పిలుచుకుంటారు. మరోవైపు ఈ గ్రామంలో కుక్కలు రాజభోగాలు అనుభవిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రస్ట్ ద్వారా కొంతమంది మహిళలను వారికి ఆహారం సిద్ధం చేయడానికి నియమించారు. వారి ద్వారా ఈ గ్రామంలోని గ్రామ సింహాలకు రోజుకు వెయ్యి రొట్టెలు తయారుచేస్తారు. వాలంటీర్లు వాటిని తీసుకెళ్లి కుక్కలకు తినిపిస్తున్నారు. కుక్కలకు రోటీలు అందించేందుకు గ్రామంలో రెండు బృందాలను ఏర్పాటు చేశారు.