ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) లఖీంపుర్‌లో(Lakhimpur) ఓ వింతఘటన చోటు చేసుకుంది. ఖీరీలోని భీరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పుట్హా గ్రామంలో జరిగిన ఈ ఘటన కొంచెం భయానకమైనదే! అందుకే కదా ఆ ఇంట్లో వారు గజగజమని వణికిపోయి బయటకు పరుగులుపెట్టారు. అలా భయపడటానికి కారణమేమిటంటే ఆ ఇంటి బెడ్‌రూమ్‌లోని మంచం కింద రాత్రంతా ఓ భారీ మొసలి(Crocodile) నక్కి ఉండటమే! తెల్లారి లేచి చూస్తే మొసలి కనిపించింది. ఆ క్షణంలో ఇంట్లో వారందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) లఖీంపుర్‌లో(Lakhimpur) ఓ వింతఘటన చోటు చేసుకుంది. ఖీరీలోని భీరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పుట్హా గ్రామంలో జరిగిన ఈ ఘటన కొంచెం భయానకమైనదే! అందుకే కదా ఆ ఇంట్లో వారు గజగజమని వణికిపోయి బయటకు పరుగులుపెట్టారు. అలా భయపడటానికి కారణమేమిటంటే ఆ ఇంటి బెడ్‌రూమ్‌లోని మంచం కింద రాత్రంతా ఓ భారీ మొసలి(Crocodile) నక్కి ఉండటమే! తెల్లారి లేచి చూస్తే మొసలి కనిపించింది. ఆ క్షణంలో ఇంట్లో వారందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే తేరుకుని బయటకు పరుగులుపెట్టారు. ఊరు కాబట్టి విషయం అందరికీ తెలిసింది..మొసలిని చూసేందుకు పోలోమని వచ్చేశారు. విషయం అటవీశాఖ అధికారులకు కూడా తెలిసిపోయింది. అయితే వారు వచ్చేలోపు ఊరివారంతా కలిసి దాన్ని ఓ సంచీలో బంధించేశారు. ఆనక ఆ మొసలిని నదిలో వదిలేశారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా శారదా నదిలోకి వరదనీరు చేరింది. ఈ నేపథ్యంలోనే శారదా నది నుంచి కొట్టుకు వచ్చిన ఒక భారీ మొసలి గ్రామానికి చెందిన లాలా రామ్‌ ఇంట్లోకి చేరింది. రాత్రంతా మంచం కిందే ఉంది. ఆ మంచం మీదనే ఇంటి యజమాని లాలా రామ్‌ పడుకున్నాడు. ఉదయం ఆయన కళ్లు తెరవగానే భారీ ఆకారంలో ఉన్న మొసలి కనిపించింది. భయంతో గట్టిగా కేకలు పెట్టాడు. అతడి అరుపులు విన్న ఇంట్లోని వారంతా భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా లాలారామ్‌ ఇంటికి చేరుకున్నారు. దాన్ని ఓ సంచీలో బంధించి నదిలో వదిలిపెట్టారు.

Updated On 26 July 2023 5:18 AM GMT
Ehatv

Ehatv

Next Story