మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది ఆంగ్ల నానుడి. అంటే పెళ్లిళ్లు(Marriages) స్వర్గంలో జరుగుతాయని! అలాగని రూలేమీ లేదు. అప్పుడప్పుడు జైలులో కూడా జరగవచ్చు. ఒడిషాలో(Odisha) ఓ పెళ్లి ఇలాగే జైల్లో(Jail) జరిగింది. అది కూడా నేరారోపణతో జైలు జీవితం గడుపుతున్న వ్యక్తితో. జైలు అధికారుల అనుమతితో ప్రియురాలి మెడలో పూలదండ వేసి జీవిత భాగస్వామిని చేసుకున్నాడా ఖైదీ(Criminal). పెళ్లి సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం చక్కగా, గొప్పగా జరిగింది
మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది ఆంగ్ల నానుడి. అంటే పెళ్లిళ్లు(Marriages) స్వర్గంలో జరుగుతాయని! అలాగని రూలేమీ లేదు. అప్పుడప్పుడు జైలులో కూడా జరగవచ్చు. ఒడిషాలో(Odisha) ఓ పెళ్లి ఇలాగే జైల్లో(Jail) జరిగింది. అది కూడా నేరారోపణతో జైలు జీవితం గడుపుతున్న వ్యక్తితో. జైలు అధికారుల అనుమతితో ప్రియురాలి మెడలో పూలదండ వేసి జీవిత భాగస్వామిని చేసుకున్నాడా ఖైదీ(Criminal). పెళ్లి సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం చక్కగా, గొప్పగా జరిగింది ఝరపడా ప్రత్యేక జైలు(Jharpada Special Jail) సోమవారం పెళ్లి కళతో కళకళలాడింది. ఝరపడా ప్రత్యేక జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా అమ్మాయి తరపువారు గతంలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలం గడిచే కొద్దీ రెండు కుటుంబాల మనసు మారడం మొదలయ్యింది. వివాదాలతో సతమతమైన ప్రేమకథకు అందమైన ముగింపు లభించింది. ప్రేమికుల పెళ్లి జరపడానికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో ఆ అమ్మాయి తన ప్రేమికుడితో పెళ్లి కోసం ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీని సంప్రదించింది. అలాగే జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రేమికుడు కూడా ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారుల ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని వేడుకున్నాడు. వీరి అభ్యర్థనపై జైలు, న్యాయ శాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. పెళ్లి తంతుని మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చట్టపరమైన నిబంధనల మేరకు వీరి పెళ్లిని ఉత్సాహంగా జరిపించారు.