ఇంగ్లాండ్‌తో(England) రాజ్‌కోట్‌లో(Rajkot) జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌(Test match) నుంచి రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) అకస్మాత్తుగా తప్పుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు హుటాహుటిన చెన్నైకు(Chennai) వెళ్లాడు అశ్విన్‌. రెండో రోజు అశ్విన్‌ అరుదైన రికార్డును సాధించిన సంగతి తెలిసిందే. టెస్ట్‌ల్లో 500 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్‌ చెన్నైకు వెళ్లినట్టు బీసీసీఐ(BCCI) వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా(Rajiv Shukla) తెలిపాడు.

ఇంగ్లాండ్‌తో(England) రాజ్‌కోట్‌లో(Rajkot) జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌(Test match) నుంచి రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) అకస్మాత్తుగా తప్పుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు హుటాహుటిన చెన్నైకు(Chennai) వెళ్లాడు అశ్విన్‌. రెండో రోజు అశ్విన్‌ అరుదైన రికార్డును సాధించిన సంగతి తెలిసిందే. టెస్ట్‌ల్లో 500 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్‌ చెన్నైకు వెళ్లినట్టు బీసీసీఐ(BCCI) వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా(Rajiv Shukla) తెలిపాడు. అశ్విన్‌ లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బే! అశ్విన్‌ తప్పుకోవడంతో ఇప్పుడు టీమిండియా దగ్గర నలుగురు మాత్రమే ఫుల్‌టైమ్‌ బౌలర్లు ఉన్నారు. అయితే అశ్విన్‌ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకునే అవకాశం ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది. మెరిలీబోన్ క్రికెట్ క్ల‌బ్‌(MCC) రూల్స్ ప్ర‌కారం అశ్విన్ స్థానంలో స‌బ్‌స్టిట్యూట్ ఫీల్డ‌ర్‌ను తీసుకునేందుకు అంపైర్లు అవ‌కాశం క‌ల్పిస్తారు. ప్లేయ‌ర్ గాయ‌ప‌డ్డా లేక అస్వ‌స్థ‌త‌కు గురైనా అప్పుడు ఆ అవ‌కాశం ఇస్తారు. ఎంసీసీ రూల్ నెంబ‌ర్ 24.1.1.2 ప్ర‌కారం కూడా స‌బ్‌స్టిట్యూట్ ఆట‌గాడిని తీసుకునే ఛాన్సు ఉంది. కానీ ఈ మ్యాచ్‌లో అశ్విన్ గాయ‌పడ‌లేదు, అస్వ‌స్థ‌త‌కు లోనుకాలేదు. అందు వ‌ల్ల అశ్విన్ స్థానంలో రాజ్‌కోట్ టెస్టు కోసం కేవ‌లం స‌బ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌కు మాత్ర‌మే అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. అది కూడా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అనుమతి ఇస్తేనే! . స‌బ్‌స్టిట్యూట్ ఫీల్డ‌ర్‌కు బ్యాలింగ్ కానీ బౌలింగ్ కానీ చేసే అవ‌కాశం ఉండ‌దు. కేవ‌లం కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్ ఆట‌గాళ్ల‌కు మాత్ర‌మే బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవ‌కాశం ఉంటుంది

Updated On 17 Feb 2024 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story