బీజేపీ(BJP) రాజ్య‌స‌భ(Rajya sabha) స‌భ్యుడు జీవీఎల్‌ నరసింహారావు(GVL Narsimha Rao) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ గెస్ట్ ఆర్టిస్టుగా వస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ(K.RamaKrishna) విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలో(Thadepally) ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి బలం లేకపోతే జీవీఎల్‌ ఎందుకు మండిపడుతున్నారో చెప్పాలని అన్నారు.

బీజేపీ(BJP) రాజ్య‌స‌భ(Rajya sabha) స‌భ్యుడు జీవీఎల్‌ నరసింహారావు(GVL Narsimha Rao) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ గెస్ట్ ఆర్టిస్టుగా వస్తారని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ(K.RamaKrishna) విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలో(Thadepally) ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి బలం లేకపోతే జీవీఎల్‌ ఎందుకు మండిపడుతున్నారో చెప్పాలని అన్నారు. భారతదేశ చరిత్రతో ఏమాత్రం సంబంధంలేని పార్టీ.. స్వతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీ.. భారతీయ జనతా పార్టీ అని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు బ్రిటీష్‌ వాళ్ళ అడుగులకు మడుగులెత్తారే తప్ప స్వతంత్ర పోరాటంలో వారి పాత్ర ఏమి లేదని విమర్శించారు.

నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదని అన్నారు. బీజేపీ(BJP) 2014 లోక్ సభ ఎన్నికల్లో ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదని అన్నారు. బీజేపీ ఈ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని.. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయని అన్నారు. బీజేపీ రాష్ట్రానికి దేశానికి చేసింది ఏమీలేదని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు గెలిచినా.. ఓడినా.. సీట్లు ఉన్నా లేకపోయినా.. పోరాడే పార్టీలు ఎర్రజెండా పార్టీలని అన్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పోరాడే పార్టీ ఎర్రజెండా పార్టీ అని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Updated On 1 Oct 2023 4:38 AM GMT
Ehatv

Ehatv

Next Story