లెక్కించడానికి వాడే మొదటి అంకె ఒకటి(One)! ఏ లెక్కైనా ఒకటి నుంచే మొదలవుతుంది. అంటే ఒక్కటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుంది. చూడ్డానికి చాలా చిన్న అంకెనే .. కానీ కొన్ని సార్లు ఇదే అంకె కొందరి జీవితాలను తారు మారు చేస్తుంది. అందుకే ఒక్కటినెప్పుడూ తేలికగా తీసుకోవద్దు. పరీక్షలో ఒక్క మార్కు, క్రికెట్‌లో ఒక్క రన్, ఫుట్‌బాల్‌లో ఒక్క గోల్ ఎలాగైతే గెలుపోటములను నిర్ధారిస్తాయో అలాగే ఎన్నికల్లో(Elections) కూడా ఒక్క ఓటు(Vote) జయాపజయాలను శాసిస్తుంది. వాజపేయి(Vajpayee) సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం(NDA government) ఒక్క ఓటుతోనే కదా కుప్పకూలింది! అందుకే ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ప్రతి ఒక్క ఓటుకు ప్రాధాన్యతనిస్తారు.
లెక్కించడానికి వాడే మొదటి అంకె ఒకటి(One)! ఏ లెక్కైనా ఒకటి నుంచే మొదలవుతుంది. అంటే ఒక్కటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుంది. చూడ్డానికి చాలా చిన్న అంకెనే .. కానీ కొన్ని సార్లు ఇదే అంకె కొందరి జీవితాలను తారు మారు చేస్తుంది. అందుకే ఒక్కటినెప్పుడూ తేలికగా తీసుకోవద్దు. పరీక్షలో ఒక్క మార్కు, క్రికెట్‌లో ఒక్క రన్, ఫుట్‌బాల్‌లో ఒక్క గోల్ ఎలాగైతే గెలుపోటములను నిర్ధారిస్తాయో అలాగే ఎన్నికల్లో(Elections) కూడా ఒక్క ఓటు(Vote) జయాపజయాలను శాసిస్తుంది. వాజపేయి(Vajpayee) సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం(NDA government) ఒక్క ఓటుతోనే కదా కుప్పకూలింది! అందుకే ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ప్రతి ఒక్క ఓటుకు ప్రాధాన్యతనిస్తారు. 2004లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections 2004) పాపం జేడీఎస్(JDS) అభ్యర్థి ఒక్కటంటే ఒక్క ఓటుతోనే ఓడిపోయారు. సంతేమరహళ్లి నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున పోటీ చేసిన ఏఆర్ కృష్ణమూర్తి(AR Krishnamurthy) కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.
ధ్రువనారాయణ(dhruva Narayana) చేతిలో ఒకే ఓటు తేడాతో పరాజయం చెందారు. ధ్రువనారాయణ్‌కు 40,572 ఓట్లు వస్తే, కృష్ణమూర్తికి 40,751 ఓట్లు వచ్చాయి. రెండు మూడు సార్లు లెక్కించినప్పటికీ ఈ అంకె మారలేదు. ఓడిన కృష్ణమూర్తి ఘటనలో ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. కృష్ణమూర్తి కారు డ్రైవర్(Car Driver) ఆయనకు ఓటు వేయలేదు. ఓటు వేయలేదు అని అనడం కంటే ఓటు వేయనీయకుండా కృష్ణమూర్తే అడ్డుపడ్డారనడం బాగుంటుంది. ఎందుకంటే ఓటేసేందుకు కృష్ణమూర్తిని డ్రైవర్ అనుమతి అడిగినా.. పోలింగ్ రోజు కావడంతో కుదరని డ్యూటీలోనే ఉంచారట కృష్ణమూర్తి. ఈ ఓటమి తర్వాత కృష్ణమూర్తికి తత్వం బోధపడింది. తన రాజకీయ ప్రత్యుర్థలెవరకీ ఇలాంటి ఓటమి రాకూడదని ఆయన కోరుకున్నారు.
2008లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు(2008 Rajasthan Assembly Elections) ఇలాంటి సంఘటనే జరిగింది. నాథ్‌ద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్(Congress) నుంచి పోటీ చేసిన సీపీ జోషి(CP Joshi) బీజేపీ అభ్యర్థి కల్యాణ్‌సింగ్ చౌహాన్(Kalyan Singh Chuhan) చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు.
కల్యాణ్‌సింగ్ చౌహాన్‌కు 62,216 ఓట్లు లభించగా, సీపీ జోషికి 62,215 ఓట్లు వచ్చాయి. అప్పట్లో ఈ ఫలితం సంచలనం సృష్టించింది. రాజకీయ విశ్లేషకుల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అందుకు కారణం సీపీ జోషి అప్పుడు రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఈ ఎన్నికపై జోషి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కల్యాణ్‌సింగ్ చౌహాన్ భార్య రెండు పోలింగ్ బూత్‌లలో ఓటు వేశారని జోషి ఆరోపించారు. రాజస్తాన్ హైకోర్టు జోషికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో కల్యాణ్‌సింగ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ మాత్రం జోషికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. విశేషమేమింటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం. జోషి కనుక గెలిచి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆ సువర్ణావకాశం అశోక్ గెహ్లాట్‌కు(Ashok Gehlat) దక్కింది. చూశారుగా.. కేవలం ఒకే ఒక్క ఓటు ఎంత పని చేసిందో! ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా చేజార్చింది. ఇక్కడ మరో ట్విస్టు ఉంది. ఆ ఎన్నికల్లో సీపీ జోషి తల్లి, ఆయన సోదరి, చివరాఖరికి ఆయన కారు డ్రైవర్ కూడా కొన్ని కారణాల వల్ల ఓటు వేయలేదు.
ఈ ముగ్గురు ఓటు వేసి ఉంటే జోషి గెలిచేవారు. ముఖ్యమంత్రి అయ్యేవారు. సింగిల్ డిజిట్ ఓట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు చాలా మందే ఉన్నారు. 2018లో మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో(Mizoram Assembly elections) తుయివావ్ల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.ఎల్.పియాన్మావాయి(RL Pianmawai) కేవలం మూడు ఓట్ల తేడాతో పరాజయం చెందారు. ఈయనకు పోటీగా నిలుచున్న మిజోరాం నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి లాల్ చాందమా రాల్తేకు 5,207 ఓట్లు లభించగా, పియాన్మావాయికి 5,204 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా ఇదే ఫలితం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. లోక్‌సభ ఎన్నికల్లో కూడా రెండుసార్లు ఇలా సింగిల్ డిజిట్ పరాజయాలు నమోదయ్యాయి.1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ రాజ్‌మహల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన సోమ్ మారండి కూడా తొమ్మిది ఓట్ల తేడాతోనే గెలుపొందారు. అందుకే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటేయండి.. అది మీ హక్కు!