దేశంలో కరోనా వైరస్(Corona Virus) కలకలం రేపుతోంది. ప్రమాదఘంటికలను మోగిస్తోంది. కనుమరుగయ్యిందని అనుకునే లోపే మళ్లీ తన తడాఖాను చూపిస్తోంది. కొద్ది రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఫోర్త్ వేవ్(Fourth wave) ముంచుకొస్తుందేమోనన్న భయమూ కలుగుతోంది. గత 24 గంటల్లో 5, 880 మందికి కరోనా సోకింది. నిన్న ఒక్క రోజే 14 మంది కరోనాతో కన్నుమూశారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,41,96,318కా చేరుకుంది. మరణాల సంఖ్య 5,30,979కు చేరుకుంది. గుజరాత్(Gujarat), హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh)లలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.
దేశంలో కరోనా వైరస్(Corona Virus) కలకలం రేపుతోంది. ప్రమాదఘంటికలను మోగిస్తోంది. కనుమరుగయ్యిందని అనుకునే లోపే మళ్లీ తన తడాఖాను చూపిస్తోంది. కొద్ది రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఫోర్త్ వేవ్(Fourth wave) ముంచుకొస్తుందేమోనన్న భయమూ కలుగుతోంది. గత 24 గంటల్లో 5, 880 మందికి కరోనా సోకింది. నిన్న ఒక్క రోజే 14 మంది కరోనాతో కన్నుమూశారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,41,96,318కా చేరుకుంది. మరణాల సంఖ్య 5,30,979కు చేరుకుంది. గుజరాత్(Gujarat), హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh)లలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాలలో నలుగురు చొప్పున చనిపోయారు. కేరళలో ఇద్దరు మరణించారు. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.74 శాతం ఉంటే, మరణాల రేటు 1.19గా ఉంది. చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా కట్టడికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ కరోనా నిబంధనలు అమలు చేశాయి. హర్యానా, కేరళ, పుదుచ్చేరిలలో మాస్క్ తప్పనిసరి అయ్యింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అలెర్టయ్యింది.
కరోనా బాధితులకు చికిత్స అందించే హాస్పిటల్‌లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రెండు రోజుల పాటు మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. ఆసుపత్రులలో పడకల సామర్థ్యం, ఐసోలేషన్, ఆక్సిజన్ వసతి ఉనన పడకలు, వెంటిలేటర్, ఐసీయూ బెడ్‌ల వివరాలను మాక్‌డ్రిల్‌లో సేకరిస్తారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, అంబులెన్స్ వివరాలను కూడా తెలుసుకుంటారు. ప్రైమరీ హెల్త్ సెంటర్‌లలో ఉన్న పరీక్షాకేంద్రాలు, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు, పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్‌లు, మాస్క్‌లు, వెంటిలేటర్‌లు ఎన్ని ఉన్నాయో మాక్‌డ్రిల్‌లో గుర్తిస్తారు. వీటిని వైద్య ఆరోగ్య శాఖకు నివేదిస్తారు. కొన్ని చోట్ల విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలను తప్పనిసరి చేశారు.