దేశంలో నమోదవుతున్న కోవిడ్ కేసులతో వైరస్ మళ్లీ లోకల్ స్టేజ్‌లోకి వచ్చేస్తోందని నిపుణులు అంటున్నారు. గడిచిన 8నెలల్లో ఇంత స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటి సారి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరోవైపు కేసులు 10 వేలకు పైగా నమోదవ్వడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
కరోనా వైరస్ మళ్లీ భారత్‌లో కోరలు చాస్తోంది. రోజురోజుకీ దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,112 పాజిటివ్ కేసులు( Covid cases) నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో నమోదవుతున్న కోవిడ్ కేసులతో వైరస్ మళ్లీ లోకల్ స్టేజ్‌లోకి వచ్చేస్తోందని నిపుణులు అంటున్నారు. గడిచిన 8నెలల్లో ఇంత స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటి సారి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరోవైపు కేసులు 10 వేలకు పైగా నమోదవ్వడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే దేశవ్యాప్తంగా కొవిడ్( Covid) పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉంది. ఢిల్లీలో(Delhi) పాజిటివిటీ రేటు 26.46 శాతంగా ఉంది. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 1,515 కేసులు నమోదయ్యాయి. కరోనాతో (Corona)ఆరుగురు మరణించారు. మహారాష్ట్రలో కొత్తగా 850 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు మరణించారు. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. ఈ వేరియంట్ మరీ అంత శక్తిమంతమైనది కాదని పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా వెల్లడించారు. ఈ వేరియంట్ కొంతవరకు మాత్రమే ప్రభావం చూపగలదని చెప్పారు.
మరోవైపు సుప్రీంకోర్టులో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. గతంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో పాటు పలువురు ధర్మాసనం సిబ్బంది కోవిడ్ బారిన పడటంతో సుప్రీంకోర్టులో మూసివేయబడింది. అయితే ఇప్పుడు నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, ఎస్ రవీంద్ర భట్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా కరోనా సోకింది. కోవిడ్ సోకి జస్టిస్ సూర్యకాంత్ వారం క్రితం కరోనా నుంచి కోలుకున్నారు. ఈక్రమంలో సుప్రీంకోర్టులో స్వలింగ వివాహ కేసును భౌతికంగా విచారిస్తున్న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో భాగంగా ఉన్న జస్టిస్ భట్ కు కోవిడ్ సోకింది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే జస్టిస్ కౌల్ వైద్యపరమైన అత్యవసర కారణంగా కోర్టుకు సెలవు పెట్టారు. ప్రస్తుతం కేసుల పెండింగ్‌ను నివారించడానికి ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌లకు కేసులను కేటాయించారు
డబ్ల్యూహెచ్‌ఓ(W.H.O)ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, కౌమార బాలబాలికలు కొవిడ్-19 టీకాలు అదనంగా తీసుకోవాల్సిన అవసరం పెద్దగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సలహా ఇచ్చింది. అయితే, ఇతర టీకాలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. రోటావైరస్, తట్టు (మీజిల్స్), న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ లాంటి అత్యవసర సంప్రదాయ టీకాలతో పోలిస్తే పిల్లలు, కౌమార బాలబాలికల మీద కొవిడ్ టీకాల ప్రభావం చాలా తక్కువని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఆ కొవిడ్ 19 టీకాలను వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న వర్గాలకు కేటాయిస్తే మంచిదని పేర్కొన్నది.