దాదాపు నాలుగు నెలల తర్వాత భారత్‌లో మళ్లీ అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు(Covid Cases) నమోదవుతున్నాయి. గత రెండు రోజుల్లో దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి. సాధారణంగా చలికాలంలో (Winter) కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ....కానీ ఇప్పుడు వేసవి(summer)లో కూడా కోవిడ్ కేసులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే చాలామంది మాస్క్ లు ధరించకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ముఖ్యంగా కరోనా సోకిన వారు కూడా మాస్క్ లు ధరించకుండా ఉండటంతో ఈ కోవిడ్ కేసులు మరింత పెరుగుతున్నాయంటున్నారు డాక్టర్స్ .
దేశంలో కరోనా మహామ్మారి మళ్లీ విజృంభిస్తోంది...పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు (Covid-19) పెరుగుతున్నాయి. రోజు రోజుకు కొత్త కేసులు(new covid cases) పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు(Covid cases) ఎక్కువ అయ్యాయి. దీంతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిపై కేంద్రం ఇప్పటికే హైఅలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. కేంద్రం లేఖ రాసిన ఆరు రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి.ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఆస్పత్తుల్లో మాక్ డ్రిల్ (mock drill)నిర్వహించింది. కరోనా కేసులపై తెలంగాణ ,ఏపీ హెల్త్ డిపార్ట్ మెంట్ లు అప్రమత్తం అయ్యాయి.
అయితే దాదాపు నాలుగు నెలల తర్వాత భారత్‌లో మళ్లీ అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు(Covid Cases) నమోదవుతున్నాయి. గత రెండు రోజుల్లో దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి. సాధారణంగా చలికాలంలో (Winter) కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ....కానీ ఇప్పుడు వేసవి(summer)లో కూడా కోవిడ్ కేసులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే చాలామంది మాస్క్ లు ధరించకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ముఖ్యంగా కరోనా సోకిన వారు కూడా మాస్క్ లు ధరించకుండా ఉండటంతో ఈ కోవిడ్ కేసులు మరింత పెరుగుతున్నాయంటున్నారు డాక్టర్స్ . ఇక కొవిడ్, ఇన్ ప్లూయెంజా కేసులు పెరగడం కూడా ప్రజల్లో గందరగోళం నెలకొంది. వీటి లక్షణాలు ఒకేలా ఉండడంతో ఆందోళనకు గురవుతున్నారు. అయితే వైరస్ ను ఎదుర్కొనేందుకు రద్ధీ ప్రాంతాలకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ప్రజలకు సూచిస్తోంది.
కోవిడ్ మహమ్మారి నిర్ములనకు చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి( Union Health Secretary ) రాజేష్ భూషణ్ ((Rajesh Bhushan )లేఖల్లో సూచించారు. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్ ట్రాక్, ట్రీట్ వ్యాక్సినేషన్ అనుసరించాలని కేంద్రం కోరింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ (ఇన్‌ఫ్లూయెంజా) కలకలం రేపుతోంది. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. రాబోయే రోజుల్లో వైరస్ విజృంభన నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రం ఇవాళ్టీ వీడియో కాన్ఫరెన్స్ ( Video conference) లో రాష్ట్రాలకు సూచించనున్నట్లు తెలుస్తోంది.