ఎంత ఘాటు ప్రేమయో..ఇంత లేటు వయసులో అంటూ పింగళి పాటకు శ్రీశ్రీ పేరడి రాశారు. లేటు వయసులో నిజంగానే ఘాటు ప్రేమ ఉంటుంది. అందుకు బోల్డన్నీ ఉదాహరణలు. మోహన్‌కుమార్, సుధలు లేటెస్ట్ ఎగ్జాంపుల్. దశాబ్దాల కాలంగా ప్రేమించుకున్న జంట మొన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యింది. ఈ ఘటన కర్ణాటకలోని(Karnataka) తమకూరు(Thamakuru) జిల్లా గుబ్బి తాలూకాలో జరిగింది. పాతికేళ్లుగా ప్రేమించుకున్న మోహన్‌కుమార్, సుధ తరికెరె దగ్గర ఉన్న అమృత్‌పూర్‌లోని అమృతేశ్వరస్వామి ఆలయంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.
ఎంత ఘాటు ప్రేమయో..ఇంత లేటు వయసులో అంటూ పింగళి పాటకు శ్రీశ్రీ పేరడి రాశారు. లేటు వయసులో నిజంగానే ఘాటు ప్రేమ ఉంటుంది. అందుకు బోల్డన్నీ ఉదాహరణలు. మోహన్‌కుమార్, సుధలు లేటెస్ట్ ఎగ్జాంపుల్. దశాబ్దాల కాలంగా ప్రేమించుకున్న జంట మొన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యింది. ఈ ఘటన కర్ణాటకలోని(Karnataka) తమకూరు(Thamakuru) జిల్లా గుబ్బి తాలూకాలో జరిగింది. పాతికేళ్లుగా ప్రేమించుకున్న మోహన్‌కుమార్, సుధ తరికెరె దగ్గర ఉన్న అమృత్‌పూర్‌లోని అమృతేశ్వరస్వామి ఆలయంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. సుధ వయసు 54 ఏళ్లు, మోహన్‌కుమార్ వయసు 52 ఏళ్లు. వీరిద్దరూ మైసూరులోని అబ్దుల్ నజీర్‌సాబ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయత్ రాజ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఉద్యోగులు. పంచాయతీరాజ్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శిక్షణనిచ్చే రిసోర్స్ మాస్టర్ ట్రైనర్‌లుగా పనిచేస్తున్నారు. మోహన్‌కుమార్ బ్రాహ్మణుడు. సుధనేమో మరాఠీ మహిళ. యువకునిగా ఉన్నప్పుడు మోహన్‌కుమార్ కమ్యూనిస్టుల పట్ల ఆకర్షితులయ్యారు. సీపీఎంలో చేరి చిక్కమగళూరు జిల్లాలో రైతు సంఘంలో పోరాటాలు, ఉద్యమాలలో పాల్గొన్నారు. తొమ్మిదో దశకంలో బీ.కే.సుందరేకి మోహన్ ప్రియశిష్యుడు. ఆ తర్వాత బెంగళూరు హెచ్ఏఎల్‌లో కార్మికుడిగా కొంతకాలం పని చేశారు. నవ కర్ణాటక ప్రచురణలో వ్యాసాలు కూడా రాశారు. అదే సమయంలో సుధ కూడా కమ్యూనిస్టు కార్యకర్తగా సామాజిక ఉద్యమాలలో పాల్గొనేవారు. అలా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అది గాఢమైన ప్రేమగా మారింది. 2005లో ఇద్దరూ మైసూరులో పంచాయత్ రాజ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో రిసోర్స్ పర్సన్‌లుగా ఎంపికయ్యారు. మోహన్, సుధ అన్యోన్యతను చూసిన అక్కడి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వీరిద్దరూ భార్యాభర్తలై ఉండొచ్చని అనుకునేవారు. మరి భార్యాభర్తలు ఎందుకు కాలేదంటే అన్ని ప్రేమకథల్లాగే వీరి పెళ్లిని కూడా రెండు కుటుంబాలు ఒప్పుకోలేదు. అందుకే పెళ్లి చేసుకోకుండా ప్రేమను కొనసాగిస్తూ వచ్చారు. ఈ అపురూపమైన జంటకు పెళ్లి చేయాలనుకున్నారు సన్నిహితులు, స్నేహితులు. అప్పుడే వారి ప్రేమకు సార్థకత చేకూరుతుందని అనుకున్నారు. మోహన్‌కుమార్, సుధ కూడా పెళ్లికి అంగీకరించడంతో బంధు మిత్రులు సంబరపడ్డారు. సుధ మెడలో మోహన్‌కుమార్ తాళి కట్టారు. పెళ్లికి వచ్చినవారంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.