బెంగూరులోని(Bangalore) జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వింత సంఘటన జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఓ పార్క్‌లో(Park) యువతి, యువకుడు ఆ పనిలో ఉన్నారు. వీరి వ్యవహారమంతా అటుగా వెళ్తున్నవారి దృష్టిలో పడింది.

బెంగూరులోని(Bangalore) జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వింత సంఘటన జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఓ పార్క్‌లో(Park) యువతి, యువకుడు ఆ పనిలో ఉన్నారు. వీరి వ్యవహారమంతా అటుగా వెళ్తున్నవారి దృష్టిలో పడింది. ఇది గమనించిన పోలీసులు ఆ యువతీయువకుడిని అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో ఆవేశంతో పోలీసులపైకే కారు ఎక్కించారు. ఈ ప్రమాదంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌కు గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.

జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్కులో మధ్యాహ్న సమయంలో ఓ కారు అక్కడికి వచ్చింది. కారులో ఓ యువకుడు, యువతి ఉన్నారు. కారులోనే శృంగార క్రీడ ప్రారంభించారు. కారులో యువతి నగ్నంగా ఉన్న దృశ్యాలనులను అటుగా వెళ్తున్నవారు గమనించారు. అదే ప్రాంతంలో డ్యూటీ విధుల్లో ఉన్న ఎస్సై మహేష్‌ ఈ జంట చేసే నిర్వాకాన్ని చూశాడు. దీంతో కారు దగ్గరికి వెళ్లి నెంబర్‌ ప్లేట్‌ను చెక్‌ చేస్తుండగా.. ఆ పనిలో ఉన్న యువకుడు ఒక్కసారిగా లేచి.. కార్‌ స్టార్ట్‌ చేశాడు. కారును(Car) రివర్స్‌ తీసి, వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌(SI Mahesh) కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన మహేష్‌ను ఆస్పత్రికి తరలించారు. దీంతో స్థానికులు భయాందోళనకుగురయ్యారు. కారును ఆపేందుకు జనం పరుగులు తీసినా దొరక్కుండా పారిపోయారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Updated On 25 Jan 2024 6:11 AM GMT
Ehatv

Ehatv

Next Story