యూట్యూబ్ సహాయంతో కొత్త రకం నేరాలకు తెరతీస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా యూట్యూబ్ చూసి ఏకంగా ఓ గ్యాంగ్ రూ.500 నోట్లను ముద్రించారు.

యూట్యూబ్ సహాయంతో కొత్త రకం నేరాలకు తెరతీస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా యూట్యూబ్ చూసి ఏకంగా ఓ గ్యాంగ్ రూ.500 నోట్లను ముద్రించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగింది. నకిలీ నోట్ల తయారీ రాకెట్‌ని నడుపుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు రూ. 30,000 విలువైన ఫేక్ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫేక్‌ 500 నోట్లను తయారు చేస్తున్న నిందితులు సతీష్‌ రాయ్, ప్రయోద్‌ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. రూ.10 రూపాయల స్టాంప్‌ పేపర్లపై కంప్యూటర్ ద్వారా ప్రింటింగ్ సాయంతో ముద్రించేవారు. మిర్జాపూర్ నుంచి స్టాంప్‌ పేపర్లు కొనుగోలు చేశారు. అయితే అన్ని నోట్లపై కరెన్సీ నెంబర్ ఒకే విధంగా పెట్టారు. రూ.10 వేల ఫేక్‌ కరెన్సీని మార్చేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేశారు. 20 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే నకిలీ నోట్లను గుర్తించడం అంత తేలిక కాదని.. అచ్చం ఒరిజినల్ నోట్ల మాదిరిగానే ఉంటాయన్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ తెలియవన్నారు. నిందితులు మినరల్ వాటర్ ప్లాంట్‌లకు సంబంధించిన ప్రకటనలు తయారు చేస్తుంటారు. యూట్యూబ్ సాయంతో నకిలీ నోట్లను ప్రింట్ చేయడం నేర్చుకున్నారని పోలసీఉలు వెల్లడించారు. నకిలీ కరెన్సీతో పాటు, నోట్ల ముద్రణ పరికరాలు, ల్యాప్ టాప్ ప్రింటర్‌ను స్వాదీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ehatv

ehatv

Next Story