India Corona : భయాందోళన కలిగిస్తోన్న కరోనా వైరస్, నాలుగు వేలు దాటిన కొత్త కేసులు
ఏ దుర్ముహూర్తాన కరోనా వైరస్(Corona Virus) మన దేశంలో అడుగుపెట్టిందో కానీ అప్పట్నుంచి మనల్ని పట్టి పీడిస్తూనే ఉంది. తగ్గినట్టే తగ్గుతుంది.. మళ్లీ జోరందుకుంటోంది. మూడేళ్లు దాటినా కరోనా వైరస్ అంతరించిపోలేదు సరికదా మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుముకం పట్టిందనుకుంటే మళ్లీ పంజా విసురుతోంది. కొత్త కేసుల సంఖ్య బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 4,.435 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 15 మంది కరోనాతో చనిపోయారు. నిన్న 1,31,086 కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తే నాలుగువేల మందికి పైగా కరోనా సోకినట్టు తేలింది.
ఏ దుర్ముహూర్తాన కరోనా వైరస్(Corona Virus) మన దేశంలో అడుగుపెట్టిందో కానీ అప్పట్నుంచి మనల్ని పట్టి పీడిస్తూనే ఉంది. తగ్గినట్టే తగ్గుతుంది.. మళ్లీ జోరందుకుంటోంది. మూడేళ్లు దాటినా కరోనా వైరస్ అంతరించిపోలేదు సరికదా మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుముకం పట్టిందనుకుంటే మళ్లీ పంజా విసురుతోంది. కొత్త కేసుల సంఖ్య బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 4,.435 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 15 మంది కరోనాతో చనిపోయారు. నిన్న 1,31,086 కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తే నాలుగువేల మందికి పైగా కరోనా సోకినట్టు తేలింది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కు చేరుకుంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతానికి చేరింది. రికవరీ రేటు 98.76 శాతం కాగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. గత అయిదు నెలలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వవడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ, చత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, పుదుచ్చేరి, రాజస్తాన్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో కేసులు ఎక్కువవుతున్నాయి. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ఆరోగ్య శాఖ కొన్ని గైడ్‌లైన్స్ విడుదల చేసింది. కరోనా నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలని కోరింది. కేరళ వంటి రాష్ట్రాలలో మాస్క్‌ను కంపల్సరీ చేశారు.