కరోనా వైరస్‌(Corona virus) ప్రపంచాన్ని కుదిపేసింది. ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. అంతకు మించి వ్యాధిగ్రస్తులను చేసింది. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం అన్ని దేశాలు ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్లను(Vaccinations) తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో కూడా గుండె సమస్యలు(Heart problems) వస్తున్నాయని తేలింది. మెదడు రక్తనాళాల్లో(Veins) రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు సంభవిస్తున్నాయని తాజా అధ్యయనంలో రుజువయ్యింది.

కరోనా వైరస్‌(Corona virus) ప్రపంచాన్ని కుదిపేసింది. ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. అంతకు మించి వ్యాధిగ్రస్తులను చేసింది. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం అన్ని దేశాలు ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్లను(Vaccinations) తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో కూడా గుండె సమస్యలు(Heart problems) వస్తున్నాయని తేలింది. మెదడు రక్తనాళాల్లో(Veins) రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు సంభవిస్తున్నాయని తాజా అధ్యయనంలో రుజువయ్యింది. గులియన్ బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెర్కిర్డిటిస్ , సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (CVST) లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని అధ్యయనం వెల్లడించింది. ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో COVID-19 టీకాతో ప్రమాదం ఉందో లేదో నిర్ధారించడానికి ఓ అధ్యయనం చేపట్టారు.ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద వ్యాక్సిన్‌ అధ్యయనం ఇదేనని బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ నివేదిక అంటోంది. భారత్‌ మినహా, వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని విశ్లేషించారు. 13 రకాల ప్రభావాలను పరీశీలించారు. మోడర్నా(mRNA),కోవిషీల్డ్ (ChadOX1) వ్యాక్సిన్‌ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 టీకా తీసుకున్నవారిలో చాలా అరుదైన రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే Guillain-Barre సిండ్రోమ్‌ను కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో గుర్తించారు. ఇది కండరాలకు తీవ్ర హాని కలిగిస్తుంది. దీనికి సుదీర్ఘ చికిత్స అవసరమవుతుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా పోవచ్చు. ఈ తరహా వ్యాక్సిన్లనే మన దేశంలో కూడా పెద్ద సంఖ్యలో తీసుకున్నారు. అయిఏ దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదని నిపుణులు అంటున్నారు.

Updated On 21 Feb 2024 6:57 AM GMT
Ehatv

Ehatv

Next Story