ఇంకెక్కడి కరోనా వైరస్(Corona Virus)..ఎప్పుడో అంతరించిపోయింది. మళ్లీ వచ్చే ఛాన్సే లేదు... ఇదిగో ఇలా అనుకునే కరోనా వైరస్ మళ్లీ విస్తరించేలా చేశాం.. మన నిర్లక్ష్యం ఉండి కేసులు పెరగడానికి కారణమయ్యాం. అయితే ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఎండమిక్ స్టేలోకి ప్రవేశిస్తోందని, రాబోయే పది నుంచి 12 రోజుల్లో కేసులు బాగా పెరుగుతాయని, ఆ తర్వాత కేసులు తగ్గుతాయని వైద్యులు చెప్పిన మాట కాసింత ఊరటనిస్తోంది. కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయ.
ఇంకెక్కడి కరోనా వైరస్(Corona Virus)..ఎప్పుడో అంతరించిపోయింది. మళ్లీ వచ్చే ఛాన్సే లేదు... ఇదిగో ఇలా అనుకునే కరోనా వైరస్ మళ్లీ విస్తరించేలా చేశాం.. మన నిర్లక్ష్యం ఉండి కేసులు పెరగడానికి కారణమయ్యాం. అయితే ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఎండమిక్ స్టేలోకి ప్రవేశిస్తోందని, రాబోయే పది నుంచి 12 రోజుల్లో కేసులు బాగా పెరుగుతాయని, ఆ తర్వాత కేసులు తగ్గుతాయని వైద్యులు చెప్పిన మాట కాసింత ఊరటనిస్తోంది. కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయ. తాజాగా 2,21,725 మందికి కరోనా టెస్టులు చేస్తే 11,109 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. నిన్నటి కంటే తొమ్మిది శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 29 మంది కరోనాతో కన్నుమూశారు. ఢిల్లీ(Delhi), మహారాష్ట్ర(Maharastra)లలో పరిస్థితి కాసింత ఆందోళనకరంగానే ఉంది. ఢిల్లీలో 1,527 మందికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్రలో 1,086 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 49,622కి చేరింది. రికవరీ రేటు 98.70 శాతంగా నమోదైంది. తాజా ఉద్ధృతికి XBB.1.16 సబ్ వేరియంట్ కారణమని వైద్య నిపుణులు అంటున్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్ నియమావళిని పాటించాలని అధికారులు అంటున్నారు.
ఇదిలాఉంటే, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) నోయిడా ఆరోగ్యశాఖ కొన్ని కీలక సూచనలు చేసింది. మళ్లీ కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పింది. వైరస్ బారిన పడకుండా ప్రజలు భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని చెప్పింది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. వర్క్ ప్లేసుల్లో కరోనా నివారణ చర్యలను తప్పనిసరిగా చేపట్టాలని ఉత్తరప్రదేశ్ అధికారులు అంటున్నారు. ఆఫీసులను ఎప్పటికప్పుడు శానిటైజర్లతో శుభ్రం చేయాలని, ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ ఉష్ణోగ్రత స్కానర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కన్పిస్తే వాళ్లకు వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలన్నారు.
చేస్తున్నాయి.