ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడేళ్లపాటు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన కరోనా కంటిమీద కునుకు లేకుండా చేసింది . కాస్తా ఊపిరి తీసుకుంటున్న సమయంలో మళ్లీ అంతుచిక్కని రోగాలు వైద్య నిపుణులకు సవాలు విసురుతున్నాయి . ఇంతకు ముందు సీజనల్ జబ్బులు రావడం దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో సరిపోయేది. కానీ ఇప్పుడు సీజన్ తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో అంతుచిక్కని రోగాలు ఆందోళనలను కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఏ రోగం బారిన పడి ..ప్రాణాలకు ముప్పు […]
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడేళ్లపాటు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన కరోనా కంటిమీద కునుకు లేకుండా చేసింది . కాస్తా ఊపిరి తీసుకుంటున్న సమయంలో మళ్లీ అంతుచిక్కని రోగాలు వైద్య నిపుణులకు సవాలు విసురుతున్నాయి . ఇంతకు ముందు సీజనల్ జబ్బులు రావడం దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో సరిపోయేది. కానీ ఇప్పుడు సీజన్ తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో అంతుచిక్కని రోగాలు ఆందోళనలను కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఏ రోగం బారిన పడి ..ప్రాణాలకు ముప్పు వస్తుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది .. ఇప్పటికే హార్ట్ ఎటాక్ లు , జలుబు, జ్వరాలు ,పొడిదగ్గు , గొంతునొప్పి వంటి నానా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు .
ప్రతి సంవత్సరం మార్చిలో ప్రారంభం అయ్యే వేసవికాలం ఈ సారి ఫిబ్రవరిలో మొదటివారంలోనే ప్రారంభం అయ్యి ...చివరి వారంలోనే రికార్డుస్థాయి ఉష్టోగ్రతలు నమోదు కావడంతో ఇన్ ప్లూయోంజ వ్యాధులతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడినపుడు పెయిన్ కిల్లర్స్ ,యాంటిబయోటిక్ వాడితే రెండు మూడు రోజుల్లో తగ్గిపోయేది. కానీ ఇప్పుడు ఒక్కసారి జ్వరం , జలుబు , గొంతునొప్పి వంటివి వస్తే రెండు మూడు వారాల వరకు వదిలిపెట్టడం లేదు .
మరోవైపు ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడ్డామని ఊపిరి తీసుకుంటున్న ప్రజలకు మళ్లీ కరోనా కలవర పెడుతోంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే గత రెండు రోజుల ముందు 21 కోవిడ్ కేసులు నమోదు అయినట్టు వైద్యులు చెపుతున్నారు. జలుబు , జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్స్ ని సంప్రదించాలి. లేదంటే ఇది న్యూమెనీయాకు దారి తీసి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే దగ్గు , జలుబు వంటి లక్షణాలు జ్వరాలకు కారణం అవుతున్నాయని.... వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్స్.
అయితే ఈ వారం కోవిడ్ కేసులు పెరిగిన మాట వాస్తవమేనన్నారు గాంధీ హస్పటల్ సూపరింటెండెంట్ . ఈ కోవిడ్ కేసులు ముందు ముందు ఎక్కువ అయ్యే అవకాశాలు లేవన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే ఇలాంటి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని..వీటిని ఎదుర్కొనేందుకు ప్రజలు మంచి ఆహారం తీసుకుంటూ రోగనిరోదక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. విటమిన్ బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ తో పాటు వేడి వేడి ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.