దేశంలో మొట్టమొదటి సూపర్‌ఫాస్ట్ రైలు కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) ట్రైనే! ఇప్పుడంటే రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్ రైళ్లు(Vandhe Bharath Train) వచ్చాయి కానీ నాలుగున్నర దశాబ్దాల కిందట పట్టాలెక్కిన కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌తో ప్రయాణికులకు ఓ భావోద్వేగ సంబంధం ఉంది. ఆ ట్రైన్ పేరు చెబితే భారతీయ రైల్వే కూడా గర్వంతో ఉప్పొంగిపోతుంది.
దేశంలో మొట్టమొదటి సూపర్‌ఫాస్ట్ రైలు కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) ట్రైనే! ఇప్పుడంటే రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్ రైళ్లు(Vandhe Bharath Train) వచ్చాయి కానీ నాలుగున్నర దశాబ్దాల కిందట పట్టాలెక్కిన కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌తో ప్రయాణికులకు ఓ భావోద్వేగ సంబంధం ఉంది. ఆ ట్రైన్ పేరు చెబితే భారతీయ రైల్వే కూడా గర్వంతో ఉప్పొంగిపోతుంది. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో దీన్ని రారాజుగా పిల్చుకుంటారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తమిళనాడు రాజధాని చైన్నై నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు వెళ్లే ఈ రైలు స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లు.
నాలుగు రాష్ట్రాలను తాకుతూ 25 గంటల్లో 1,661 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 46 ఏళ్లుగా ఆ ట్రైన్ నిరంతరాయంగా నడుస్తూ ఉంది. ఉదయం తొమ్మిది గంటలకు చెన్నైలో(chennai) మొదలైతే 431 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా ప్రయాణించి ఆరు గంటల్లో విజయవాడకు(Vijayawada) చేరుకుంటుంది. అంతకు ముందు ఒంగోలులో ఆహారం కోసం, టెక్నికల్ చెకింగ్ కోసం మాత్రమే ఆగుతుంది. కోరమండల్ బయలుదేరింది అంటే.. ఆ లైన్ లో వెళ్లే మిగతా అన్నీ రైళ్లను క్రాసింగ్ లో పడేస్తారు.. హై ప్రయార్టీ కింద కోరమండల్ దూసుకెళుతుంది.
కళ్లు మూసి తెరిసే లోపు స్టేషన్ దాటిపోతుంది. చెన్నైలో స్టార్ట్ అయిన రైలు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నుంచే ఒడిశాలో(Odisha) అడుగు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం అయిదు స్టేషన్‌లలోనే ఆగుతుంది. విజయవాడ(Vijayawada), ఏలూరు(Eluru), తాడేపల్లి గూడెం(Tadepalli Gudem), రాజమండ్రి(Rajahmundary), విశాఖపట్నం(Vishakapatnam) స్టేషన్‌లలో కాసేపు ఆగుతుంది. ఒడిశాలో ఏడు చోట్ల, పశ్చిమ బెంగాల్ లో రెండు చోట్ల దీనికి స్టాప్స్ ఉన్నాయి. ప్రారంభంలో వారానికి రెండు సార్లు మాత్రమే నడిచే ఈ రైలు సర్వీసు.. తర్వాత డిమాండ్ పెరగటంతో.. ప్రతిరోజూ ఈ సర్వీసును నడుపుతున్నారు. ఇంతకు ముందు కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రమాదాలకు గురైంది కానీ, ప్రస్తుతం జరిగిన ప్రమాదం మాత్రం అతి పెద్దది. ఇప్పటి వరకు లక్షలాది మందిని ఎంతో సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చిన కోరమండల్ ఎక్స్ ప్రెస్‌కు ఇది ఊహించని పెను ప్రమాదం.