ఒడిశాలో(odissa) జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు కన్నుమూశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసగుతున్నాయి. ఇప్పటికీ కందరు ప్రయాణికులు బోగీల కింద చిక్కుకుని ఉన్నారు. ఇప్పుడీ భయానక ప్రమాద ఘటన 2009 నాటి రైలు ప్రమాదాన్ని గుర్తుకు తెస్తోంది.
ఒడిశాలో(Odisha) జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు కన్నుమూశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసగుతున్నాయి. ఇప్పటికీ కందరు ప్రయాణికులు బోగీల కింద చిక్కుకుని ఉన్నారు. ఇప్పుడీ భయానక ప్రమాద ఘటన 2009 నాటి రైలు ప్రమాదాన్ని గుర్తుకు తెస్తోంది. అప్పుడు కూడా సరిగ్గా శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఇదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) రైలే ప్రమాదానికి గురయ్యింది. సరిగ్గా 14 ఏళ్ల కిందట, ఫిబ్రవరి 13, 2009న ఒడిశాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. ఆ రోజు కూడా శుక్రవారం కావడం గమనార్హం. అప్పుడు రాత్రి ఏడున్నర గంటల నుంచి ఏడు నలభై గంటల మధ్య ప్రమాదం జరిగింది. రైలు అత్యంత వేగంతో జైపుర్(Jaipur) రోడ్ రైల్వే స్టేషన్ దాటుతోంది.
ఆ సమయంలో ట్రాక్ మార్చుకుంటున్న సమయంలో అదుపు తప్పింది. ట్రైన్ పట్టాలు తప్పింది. బోగీలు చెల్లా చెదురయ్యాయి. రైలు ఇంజన్ మరో ట్రాక్ మీద పడిపోయింది. అప్పుడు జరిగిన ప్రమాదంలో 16 మంది మరణించారు. చాలా మందికి గాయాలయ్యాయి. నిన్న జరిగిన ప్రమాదంలో పలు బోగీలు దెబ్బతిన్నాయి. కొన్ని బోగీలకు మాత్రం ఏమీ కాలేదు. కాకపోతే అందులో ఉన్న ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక తల్లడిల్లారు. 'ఒక్కసారి భారీ కుదుపునకు లోనయ్యాం. రైలు బోగీలు ఓ పక్కకు పడిపోవడాన్ని చూశాం. కుదుపులకు మాలో కొందరు బోగీల నుంచి అవతల పడిపోయారు. మేము మాత్రం ఎలాగోలా చావు నుంచి బయటపడ్డాం' అని ఓ ప్రయాణికుడు చెప్పాడు.