తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(TS Elections) విజయం సాధించిన కాంగ్రెస్‌(Congress) పార్టీ ఫుల్‌ జోష్‌ మీద ఉంది. మరో మూడు నాలుగు నెలలలో జరిగే లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) కోసం కసరత్తులు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నకల్లో అమలుపరచిన వ్యూహాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేయాలన్న భావనలో కాంగ్రెస్‌ అధినాయకత్వం ఉంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ఆల్‌రెడీ డిసైడయ్యింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(TS Elections) విజయం సాధించిన కాంగ్రెస్‌(Congress) పార్టీ ఫుల్‌ జోష్‌ మీద ఉంది. మరో మూడు నాలుగు నెలలలో జరిగే లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) కోసం కసరత్తులు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నకల్లో అమలుపరచిన వ్యూహాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేయాలన్న భావనలో కాంగ్రెస్‌ అధినాయకత్వం ఉంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ఆల్‌రెడీ డిసైడయ్యింది. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌ రాజు(Dilraju) కూడా ట్రై చేస్తున్నారట! పార్లమెంట్‌ ఎన్నికల ద్వారా రాజకీయ అరంగ్రేటం చేయాలని భావిస్తున్నారట! నిజానికి గత ఎన్నికల్లోనూ దిల్‌రాజును ఎన్నికల బరిలో దింపాలని కాంగ్రెస్‌ అనుకుంది. కారణేమిటో తెలియదు కానీ అప్పట్లో ఆయన కాంగ్రెస్‌ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ఈసారి మాత్రం చాలా ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్‌(Nizamabad) లోక్‌సభ నుంచి పోటీ చేయాలని దిల్‌రాజు అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఓకే చెప్పిందని వినికిడి! నిజామాబాద్‌ నుంచి పోటీ చేయడానికి మధు యాష్కి, షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. మరి టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి. !

Updated On 30 Dec 2023 2:31 AM GMT
Ehatv

Ehatv

Next Story