తృణమూల్(trunamul) కాంగ్రెస్(congress) నాయకురాలు మహువా మోయిత్రాకు(Mahua Moitra) ఎంపీగా(MP) కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను(Government Bunglow) వెంటనే ఖాళీ చేయాలని కేంద్రం నోటీసు ఇచ్చింది. మోయిత్రా తనంతట తానుగా స్థలాన్ని ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుందని ప్రభుత్వ ఆస్తులను నిర్వహించే డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(Directorate of Estates) నోటీసులో పేర్కొంది.
తృణమూల్(trinamool) కాంగ్రెస్(congress) నాయకురాలు మహువా మోయిత్రాకు(Mahua Moitra) ఎంపీగా(MP) కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను(Government Bunglow) వెంటనే ఖాళీ చేయాలని కేంద్రం నోటీసు ఇచ్చింది. మోయిత్రా తనంతట తానుగా స్థలాన్ని ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుందని ప్రభుత్వ ఆస్తులను నిర్వహించే డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(Directorate of Estates) నోటీసులో పేర్కొంది. లోక్‌సభ ఎంపీగా ఉన్న మొయిత్రా నెల రోజుల క్రితం లోక్‌సభ బహిష్కరణకు గురైన విషయం తెల్సిందే. ఓ వ్యాపారవేత్త నుంచి ఖరీదైన బహుమతులను స్వీకరించి, తన పార్లమెంట్ లాగిన్ ఆధారాలను అతనితో పంచుకున్నారన్న ఆరోపణలపై పార్లమెంటరీ ప్యానెల్ ఆమెను దోషిగా నిర్ధారించింది.
ప్రస్తుతానికి ఆ బంగ్లాలో ఉండేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్‌ను అభ్యర్థించాలని ఎంపీని గతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నిర్దిష్ట చార్జీలు చెల్లించి ఆరు నెలల వరకు ఆ బంగ్లాలో ఉండేందుకు నిబంధనలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అయితే నెల రోజుల పాటు ఎంపీ క్వార్టర్‌లోనే ఉంటున్న మొయిత్రాకు ఖాళీ చేయాలని తాజాగా కేంద్రం నోటీసులు ఇచ్చింది.
మహువా మొయ్‌త్రా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచింది. మహువా మోయిత్రా 2022లో జరిగిన గోవా శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా పని చేసింది. మోయిత్రా ఢిల్లీలోని టెలిగ్రాఫ్ లేన్‌లో ఉన్న బంగ్లాలో ఉన్నారు. ఆమెను ఎంపీగా బహిష్కరించిన నెల తర్వాత, జనవరి 7న ప్రభుత్వ క్వార్టర్‌ను కేంద్రం రద్దు చేసింది. అయితే మొయిత్రా మాత్రం లోక్‌సభ ఎన్నికల వరకు సమయం కోరినా కేంద్రం నోటీసులు ఇచ్చింది. తాజా నోటీసుల ప్రకారం ఆమె మరోసారి కోర్టును ఆశ్రయిస్తారా లేదా ఖాళీ చేస్తారా అన్నది చూడాలి.