మధ్యప్రదేశ్(Madya Pradesh) సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎంపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటుకానున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, మిజోరంలో జెడ్పీఎం పార్టీ అధికారంలోకి వచ్చాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతల నుంచి భిన్న‌మైన‌ స్పందన వస్తోంది.

మధ్యప్రదేశ్(Madya Pradesh) సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎంపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటుకానున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, మిజోరంలో జెడ్పీఎం పార్టీ అధికారంలోకి వచ్చాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతల నుంచి భిన్న‌మైన‌ స్పందన వస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. చిప్ ఉన్న ఏ యంత్రాన్ని అయినా హ్యాక్ చేయవచ్చని దిగ్విజయ్ అన్నారు.

మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ 163 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 66 సీట్లకు ప‌డిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 109 సీట్లు గెలుచుకుంది. 2020లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌డిపోయింది. 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నిక‌ల‌లో గెల‌వ‌డం ద్వారా బీజేపీ త‌న అధికారాన్ని నిల‌బెట్టుకుంది.

Updated On 6 Dec 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story