హర్యానా ఎన్నికల ఫలితాలు(Haryana elections) ఇలా ఉంటాయని కాంగ్రెస్(Congress) కలలో కూడా అనుకోని ఉండదు.
హర్యానా ఎన్నికల ఫలితాలు(Haryana elections) ఇలా ఉంటాయని కాంగ్రెస్(Congress) కలలో కూడా అనుకోని ఉండదు. ఓట్ల లెక్కింపు మొదలైన గంట వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఫుల్లు జోష్‌లో ఉన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో జిలేబీలు పంచిపెట్టుకున్నారు. ఘన విజయం సాధించబోతున్నామంటూ సంబరాలు చేసుకున్నారు. కానీ తర్వాత సీన్ మారింది. జిలేబీలు పంచుకోవడం బీజేపీ(BJP) వంతు అయ్యింది. పెద్ద ఎత్తున జిలేబీలకు ఆర్డర్ ఇచ్చారు. జిలేబీలు పంచిపెట్టుకోవడం వెనుక పెద్ద కథ ఉంది. హర్యానాలోని గోహనలో తయారయ్యే మాతూరాం జిలేబీలకు స్పెషాలిటీ ఉంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జిలేబీని ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ఈ జిలేబీలను దేశ వ్యాప్తంగా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయాలని అన్నారు. మాతూరాం జిలేబీ వ్యాపారులు కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ చర్యలతో ఇబ్బందులు పడ్డారని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన జిలేబీ ఫ్యాక్టరీపై బీజేపీ సెటైర్లు విసిరింది.