ఇవాళ సచిన్ తెందూల్కర్(Sachin tendulkar) జన్మదినం. భారత క్రికెట్‌కు(Cricket) సచిన్ చేసిన ఘనతలు ఉంటే ఉండవచ్చు కానీ రాజకీయంగా ఆయన చేసింది శూన్యం. రాజ్యసభ సభ్యత్వం ఆయనకు అలంకారప్రాయంగానే ఉండిపోయింది.
ఇవాళ సచిన్ తెందూల్కర్(Sachin tendulkar) జన్మదినం. భారత క్రికెట్‌కు(Cricket) సచిన్ చేసిన ఘనతలు ఉంటే ఉండవచ్చు కానీ రాజకీయంగా ఆయన చేసింది శూన్యం. రాజ్యసభ సభ్యత్వం ఆయనకు అలంకారప్రాయంగానే ఉండిపోయింది. బర్త్‌డే రోజున ఇవన్నీ చర్చించుకోవడం భావ్యం కాదు కానీ పాలిటిక్స్‌తో ఆయనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకుందాం! ఇది దశాబ్దం కిందటి ముచ్చట! ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(Varanasi) లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీ(Narendra modi) ఎన్నికల బరిలో దిగారు.
మోదీని ఢీకొట్టగల వ్యక్తి కోసం కాంగ్రెస్(Congress) అన్వేషణ మొదలు పెట్టింది. అత్యంత ప్రజాదరణ కలిగిన సెలబ్రిటీని బరిలో దించాలని కాంగ్రెస్ అనుకుంది. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లేకపోతే సీన్ వేరేగా ఉండేది. అసలు అప్పుడేం జరిగింది? కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ వారణాసి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే ఆలోచనలో పడింది. చాలా ప్రయత్నాలు చేసింది. అప్పుడు సచిన్ తెందూల్కర్ గుర్తుకొచ్చాడు. అయితే మోదీపై పోటీ చేయడానికి సచిన్ విముఖత చూపాడు. అప్పటికే రాజ్యసభ నామినేటేడె్ సభ్యుడిగా ఉన్నాడు సచిన్.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజీవ్ శుక్లా క్రికెట్ దిగ్గజం సచిన్‌ను కలుసుకుని వారణాసి నుంచి పోటీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. సచిన్ కాదనడంతో స్థానిక ఎమ్మెల్యే అజయ్‌రాజ్‌ను బరిలో దింపింది కాంగ్రెస్. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి కాంగ్రెస్ వశమయ్యింది. అప్పుడు కాంగ్రెస్‌కు చెందిన రాజేశ్‌కుమార్ మిశ్రా రెండు లక్షల ఓట్లతో గెలిచారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషి చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆనాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్‌కుమార్ మిశ్రా నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం.