కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections) కోసం కాంగ్రెస్(Conress) అభ్యర్ధుల మూడో జాబితాను విడుదల చేసింది. 43 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో అథని(Athani) స్థానం నుంచి మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడికి టికెట్ లభించగా, కోలార్ సీటు కొత్తూర్జి మంజునాథ్‌కు దక్కింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections) కోసం కాంగ్రెస్(Conress) అభ్యర్ధుల మూడో జాబితాను విడుదల చేసింది. 43 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో అథని(Athani) స్థానం నుంచి మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడికి టికెట్ లభించగా, కోలార్ సీటు కొత్తూర్జి మంజునాథ్‌కు దక్కింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది(Laxman Savadi) బీజేపీ టికెట్ నిరాకరించడంతో.. శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
డీకే శివకుమార్, సిద్ధరామయ్య(Siddaramaiah)లను కలిసిన తర్వాత లక్ష్మణ్ సవాడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సవాడి కాంగ్రెస్‌లో చేరడంపై శివకుమార్ మాట్లాడుతూ.. ఎలాంటి షరతులు లేకుండా సవాడిని పార్టీలో చేర్చుకున్నట్లు చెప్పారు. బీజేపీలో మాజీ డిప్యూటీ సీఎం పరాభవం అనుభవిస్తున్నారని అందుకే ఈ చర్య తీసుకున్నానన్నారు. టికెట్ కేటాయించకపోవడంతో ఆగ్రహం చెందిన లక్ష్మణ్ సవాడి బీజేపీ(BJP) ప్రాథమిక సభ్యత్వానికి, శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. లక్ష్మణ్ సవాడి అథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
జాబితా ప్రకారం కోలార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కొత్తూర్జి మంజునాథ్‌ను బరిలోకి దింపింది. గతంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోలార్(Kolar) అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. గతంలో ఆయన తనయుడు ప్రాతినిథ్యం వహించిన వరుణ నియోజకవర్గం నుంచి ఆయనను పార్టీ ఇప్పటికే బరిలోకి దింపింది. కుమటా అసెంబ్లీ స్థానం నుంచి మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా తనయ నివేదిత అల్వాను కాంగ్రెస్ బరిలోకి దింపింది.