కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక(Karnataka Assembly Elections)ల్లో విజయం సాధించేందుకు రాజకీయపార్టీలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. పోలింగ్‌ తేదీ తగ్గరపడటంతో ప్రచారం డోస్‌ను పెంచాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మైకులు హోరెత్తుతున్నాయి. హామీలు, వాగ్దానాలు సరేసరి! అధికార బీజేపీ మేనిఫెస్టో(BJP Manifesto)కు ధీటుగా కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డు(Congress "Guarantee" Card) పేరుతో తన మేనిఫెస్టోను రూపొందించింది. ఇవాళ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో ప్రజలను ఆకట్టుకునే పథకాలను పొందుపర్చింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక(Karnataka Assembly Elections)ల్లో విజయం సాధించేందుకు రాజకీయపార్టీలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. పోలింగ్‌ తేదీ తగ్గరపడటంతో ప్రచారం డోస్‌ను పెంచాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మైకులు హోరెత్తుతున్నాయి. హామీలు, వాగ్దానాలు సరేసరి! అధికార బీజేపీ మేనిఫెస్టో(BJP Manifesto)కు ధీటుగా కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డు(Congress "Guarantee" Card) పేరుతో తన మేనిఫెస్టోను రూపొందించింది. ఇవాళ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో ప్రజలను ఆకట్టుకునే పథకాలను పొందుపర్చింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య(Ex-Karnataka CM Siddaramaiah ), కర్నాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌(D. K. Shivakumar) సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.

తాము అధికారంలోకి వస్తే మైనారిటీ వర్గాల మధ్య విద్వేషాలను రగులుస్తున్న బజ్‌రంగ్‌దళ్‌, పీఎఫ్‌ఐ వంటి సంస్థలపై నిషేధం విధించడంతో పాటు చట్టప్రకారం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. 2006 నుండి సర్వీస్‌లో చేరిన పెన్షన్ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు OPS పొడిగింపును తమ పార్టీ పరిశీలిస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను ఒక సంవత్సరంలోగా భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. యువనిధి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడతామని, ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు రెండేళ్లపాటు ప్రతినెలా మూడు వేల రూపాయలు, డిప్లోమా చేసిన వారికి 15 వందల రూపాయలు ఆర్ధికసాయం చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ తెలిపింది. గృహజ్యోతి కింద గృహావసర విద్యుత్‌ వినియోగంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని పేర్కొంది. గృహలక్ష్మి కింద ప్రతి గృహిణికి నెలకు రెండు వేల రూపాయల చొప్పున నగదును బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. అన్నభాగ్య పథకం కింద ప్రతి వ్యక్తికి పది కిలోల బియ్యం ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపింది. బెంగళూరు మెట్రో పాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ ఆధీనంలో నడిచే బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం వసతిని కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది. నైట్‌ షిప్ట్‌ చేసే పోలీసులకు ప్రతి నెలా 5 వేల రూపాయల అలవెన్స్‌ను, ఏడాదిలో ఓ నెల అదనపు వేతనాన్ని ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యా విధానానికి బదులుగా కర్ణాటక ప్రతిష్టను ఇనుమడింపచేసేట్టుగా విద్యా విధానాన్ని రూపొందిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.

Updated On 2 May 2023 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story