కాంగ్రెస్(Congress) సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) పెళ్లి ముచ్చట చూడాలన్నది చాలా మంది కోరిక!
కాంగ్రెస్(Congress) సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) పెళ్లి ముచ్చట చూడాలన్నది చాలా మంది కోరిక! రాహుల్ తల్లి సోనియాగాంధీ(Sonia gandhi), చెల్లెలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) అభిలాష కూడా ఇదే! మొన్నటి ఎన్నికలప్పుడు రాయబరేలో రాహుల్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగిన ప్రతీసారి నవ్వుతూ కొట్టిపారేస్తారే తప్ప చేసుకుంటాననో, చేసుకోనని చెప్పరు. అలాంటిది రాయబరేలిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాత్రం జల్లీ కర్నా పడేగి .. అంటే త్వరలో పెళ్లి చేసుకోవాలి అని అన్నారు. రాహుల్ ఆ మాట అనగానే చెల్లెలు ప్రియాంక ఆనందంగా చప్పట్లు, జనం కేరింతలు కొట్టడం మనం చూశాం. అప్పట్నుంచి అన్న పెళ్లి బాధ్యతను తన భుజాన వేసుకున్నారు ప్రియాంక. పెళ్లి కూతురును వెతికే పనిలో పడ్డారు. ఇన్నాళ్లకు పెళ్లి కూతురు దొరికిందట! 54 ఏళ్ల రాహుల్‌గాంధీని మనువాడటానికి 42 ఏళ్ల ప్రణితి షిండే(Praniti shinde) సంతోషంతో ఒప్పుకున్నారట! షోలాపూర్ లోక్‌సభ సభ్యురాలైన ప్రణితి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మూడో కూతురు. ఇప్పుడు రాహుల్, ప్రణితి కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ పెళ్లి గురించి అటు రాహుల్‌గాంధీ కానీ, ఇటు ప్రణితి షిండే కానీ స్పందించలేదు. కుటుంబసభ్యులు కూడా పెదవి విప్పడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఏడాదిలో చివరిలోగా పెళ్లి ఖాయమంటూ కథనాలు వస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రాహుల్, ప్రణితి కలిసి ఏడడుగులు నడవబోతున్నారని కొందరు అంటున్నారు. మహారాష్ట్రలో జరిగిన జోడో యాత్రలో ప్రణితి చేయిపట్టుకుని రాహుల్ నడిచారు. ఆ తర్వాత లోక్‌సభ సభ్యురాలిగా ప్రణితి ప్రమాణం చేస్తున్న సమయంలోనూ రాహుల్ ఆ కార్యక్రమానికి వెళ్లారు. అప్పట్నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ కొందరు అమ్మాయిలతో ముచ్చటించారు. వారు రాహుల్‌ను సూటిగానే పెళ్లి ఎప్పుడని ప్రశ్నించారు. దానికి మీ పెళ్లి ఎప్పుడు అని రాహుల్ ప్రతిగా అడిగారే తప్ప తన పెళ్లి విషయం గురించి చెప్పలేదు. మీ పెళ్లికి మమ్మల్ని కూడా పిలవండి అని ఓ అమ్మాయి అడిగితే తప్పకుండా పిలుస్తాను అని రాహుల్ జవాబిచ్చారు. ఈ క్రమంలోనే రాహుల్‌కు పెళ్లి కళ వచ్చేసిందని చెబుతున్నారు.