Rahul Gandhi : ఆఖరి రోజు రాహుల్ గాంధీ వినూత్న ప్రచారం..ఫుడ్ డెలివరీ బాయ్స్ తో మాటాముచ్చట !
ఎన్నికల ప్రచారానికి(Election Campaign) చివరిరోజు కావడంతో అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul gandhi) వినూత్న ప్రచారం మొదలుపెట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారంలో భాగంగా ఫుడ్ డెలివరీ బాయ్స్(Delivery Boys), ఆటో డ్రైవర్లు(Auto Drivers), జీహెచ్ ఎంసీ శానిటరీ కార్మికులు, గిగ్ వర్కర్లతో మాటాముచ్చట జరిపారు. వారి సాధకబాధలను రాహుల్‌గాంధీ అడిగి తెలుసుకున్నారు.

జూబ్లీహిల్స్ నియోజవర్గం(Jublie Hills) అభ్యర్థి అజారుద్దీన్ తరఫున ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ..ఆయావర్గాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ తమ బాధలను రాహుల్ గాంధీకి చెప్పుకున్నారు. ఎంత కష్టపడ్డా జరుగుబాటు కావడం లేదని..సంపాదించినదంతా పెట్రోల్‌కే పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టూ వీలర్ ఇప్పించడంతోపాటు పెట్రోల్ రేట్లు తగ్గించాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు. తమకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించేలా చూడాలని రాహుల్‌ను కోరారు ఫుడ్ డెలివరీ బాయ్స్.
అటు జీహెచ్ఎంసీ కార్మికలు(GHMC Workers) కూడా తమ సాధకబాధలను ఏకరువు పెట్టారు. ఒకవైపు తరచూ ప్రమాదాలు జరుగుతుంటే..మరోవైపు అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఇంత కష్టపడుతున్నా..తమకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని అన్నారు. ఇక క్యాబ్, ఆటో డ్రైవర్లు కూడా రాహుల్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. పోలీసులు చలాన్లతో వేధిస్తున్నారని అన్నారు.
ఆయా వర్గాలవారు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న రాహుల్ గాంధీ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికులతో సీఎం సమావేశం అవుతారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతారని రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్స్(Gig workers) సోషల్ సెక్యూరిటీ కోసం రాజస్థాన్ లో ఒక స్కీమ్ ఆమలు చేస్తున్నామని, ప్రతి ట్రాన్సాక్షన్లో కొంత భాగాన్ని గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా రాహుల్ వారికి తెలిపారు.