Priyanka Gandhi : కాంగ్రెస్ కీలక నిర్ణయం.. మెదక్ పార్లమెంట్ నుంచి ప్రియాంక పోటీ..?
కాంగ్రెస్ తీసుకున్న సంచల నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన. కేసీఆర్ అకుంఠిత దీక్షతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు రాష్ట్రాల్లో ఓటములను మూటగట్టుకుంది. తెలంగాణలో అంతంత మాత్రంగా పార్టీ నడుస్తుంటే, ఏపీలో మాత్రం బొక్క బోర్ల పడింది.. అయితే ఇప్పుడు తెలుగురాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకురావడానికి కసరత్తులు చేస్తుంది దీనికోసం ఏకంగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగుతుంది..
కాంగ్రెస్(Congress) తీసుకున్న సంచల నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్ర విభజన. కేసీఆర్(KCR) అకుంఠిత దీక్షతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు రాష్ట్రాల్లో ఓటములను మూటగట్టుకుంది. తెలంగాణలో అంతంత మాత్రంగా పార్టీ నడుస్తుంటే, ఏపీలో మాత్రం బొక్క బోర్ల పడింది.. అయితే ఇప్పుడు తెలుగురాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకురావడానికి కసరత్తులు చేస్తుంది దీనికోసం ఏకంగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగుతుంది.. అంతేకాదు ఆమెను తెలంగాణలోని మెదక్ లోకసభ అభ్యర్థిగా పోటీచేయించాలని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలో గ్రామస్థాయిలో కాంగ్రెస్‌కు మంచి బలం ఉంది.. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో నేతలు విఫలమయ్యారు.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య సఖ్యత లేకపోవడం ఇలా అన్నీ పార్టీని వెనుకదారి పట్టిస్తున్నాయి. అక్టోబర్‌లో తెలంగాణకు ఎన్నికలు జరగనున్నాయి.. ఇక కొద్ది నెలలే సమయం ఉంది ఈలోపు పార్టీని బలోపేతం చేసి ఈసారి ఎలాగైనా అధికారాన్ని సాధించాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు.. అందుకోసమే ప్రియాంక గాంధీని మెదక్ నుంచి పోటీచేయిస్తే మళ్లీ నేతలంతా సక్యతలో ఉంటారని.. క్యాడర్‌కు మంచి ఉత్సహం దొరుకుతుందని భావిస్తున్నారట. మెదక్‌లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది.. అక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఎక్కువ.. ఒకవేళ ప్రియాంక గాంధీ ఇక్కడినుంచి పోటీ చేస్తే గెలవడం పక్కా అంటూ కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.. చూడాలి మరి ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది.