నవంబర్‌ 13న వయనాడ్‌(Waynad) లోక్‌సభకు ఉప ఎన్నికలు(Lok sabha By elections) జరగనున్నాయి.

నవంబర్‌ 13న వయనాడ్‌(Waynad) లోక్‌సభకు ఉప ఎన్నికలు(Lok sabha By elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress) అభ్యర్థిగా ప్రియాంకగాంధీ(Priyanka) బరిలోకి దిగనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ(Raibareli), కేరళలోని(Kerala) వయనాడ్‌ నుంచి రాహుల్‌గాంధీ(Rahul gandhi) గెలిచారు. అయితే వయనాడ్‌ను రాహుల్‌గాంధీ వదులుకోవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే, ప్రస్తుత పార్లమెంట్‌లో గాంధీ కుటుంబం నుంచి ఆమె మూడో ఎంపీ. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. అయితే యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ప్రియాంకగాంధీకి మద్దతు ఇచ్చింది. రాయనాడ్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యూడీఎఫ్‌ ప్రచారం చేయనుంది. అయితే బీజేపీ కూడా గట్టి అభ్యర్థి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. వయనాడ్‌లో పాగా వేయాలని బీజేపీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. అందుకోసం బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. బీజేపీ అభ్యర్థిగా ఖుష్బూ(Kushbu) పేరును కొందరు నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం అందుతోంది. ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరారు.. తర్వాత 2014లో కాంగ్రెస్‌లో చేరారు. 2021లో కాంగ్రెస్‌ను వదిలిపెట్టి ఆమె బీజేపీలో చేరారు. కేరళలోని వయనాడ్‌లో తమిళ నేపథ్యం ఉండడంతో ఖుష్బూ పేరును బీజేపీ పరిశీలిస్తోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలను తీసుకుంటోంది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ఖుష్బూ పేరు ప్రకటించే అవకాశం ఉంది.

Eha Tv

Eha Tv

Next Story