రాహుల్ గాంధీ(Rahul gandhi) ఇప్పుడు రూట్ మార్చారు. కాంగ్రెస్(Congress) పార్టీ యువరాజు ఇమేజ్ నుంచి బైటపడేందుకు తన దైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. ac గదులు వదిలి సాధారణ ప్రజలకి చేరువవడానికి కొత్త పంధా లో వెళ్తున్నారు రాహుల్. ఎవరిని కలవరు, సమస్యలపై అవగాహన ఉండదు, నెల విడిచి సాము చేస్తారు అనే అపవాదు ముందు నుంచి రాహుల్ గాంధీ పై ఉంది. అయితే ఇప్పుడు దానినుంచి బైట పడడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారు.

మొన్న మే 29న ఢిల్లీ నుంచి సిమ్లాకు వెళుతున్న రాహుల్ గాంధీ పంజాబ్ - హర్యానాకు చెందిన ట్రక్ డ్రైవర్ల బృందాన్ని ముర్తల్ వద్ద కలిశారు. ట్రక్ డ్రైవర్(Truck driver) ప్రేమ్ రాజ్పుత్(Prem rajput) అభ్యర్థన మేరకు, రాహుల్ తన ట్రక్కులో చండీగఢ్కు ప్రయాణించారు. ఆ వీడియో లను రాహుల్ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసి , "ఇది చాలా ఆసక్తికరమైన 6 గంటల ట్రక్ ప్రయాణం, ఈ సమయంలో నేను ట్రక్ డ్రైవర్ల జీవితం గురించి చాలా నేర్చుకున్నాను." అని చెప్పారు.

జూన్ 28 న ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో బైక్ మెకానిక్(Bike Mechanic) వర్క్షాప్ను సందర్శించారు. వర్క్షాప్లో మెకానిక్లతో సంభాషించడం తోపాటు మోటార్సైకిళ్లను రిపేర్(Motor cycle repair) చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ ఫొటోస్ ని కూడా రాహుల్ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ
“రెంచ్లను తిప్పి భారత్ చక్రాలను కదిలించే చేతుల నుండి నేర్చుకోవడం” చాల సంతోషంగా ఉందన్నారు.

ఇప్పుడు హర్యానాలోని సోనిపట్లో వరి నాట్లు(Paddy fields) వేసేందుకు రైతులకు సహాయం చేశారు. రాహుల్ హిమాచల్ ప్రదేశ్కు(Himachal Pradesh) వెళుతుండగా సోనిపట్లోని మదీనా(Madina) గ్రామంలో వరి నాట్లు వేయడంలో రైతులకు రాహుల్ గాంధీ సహాయం చేశారు. వరి పొలం దగ్గర ఆగి ప్యాంటు చుట్టుకుని అందులోకి అడుగు పెట్టాడు. పొలంలోకి వెళ్లి ట్రాక్టర్తో దున్నించి రైతులతో కలిసి వరి వేశాడు.

అనుభవం జీవితంలో అన్ని నేర్పిస్తుందంటరు. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయం లో అదే జరుగుతోంది. ఒక అసమర్ధ నేతగా ముద్ర పడ్డ రాహుల్ లో భారత్ జోడో యాత్ర తో మార్పు కనిపించింది. ఇలా సమాజం లో ని అట్టడుగు వర్గాలతో కలిసి, వారితో ముచ్చటించి, వారి కాస్తా సుఖాలు తెలుసుకుంటూ రానున్న ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ని అధికారం వైపు తీసుకెళ్లే ప్రయత్నం లో ఉన్నాడు.

Updated On 10 July 2023 1:09 AM GMT
Ehatv

Ehatv

Next Story