ఆదివారం కథువాలోని జస్రోటాలో పార్టీ తరపున ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
ఆదివారం కథువాలోని జస్రోటాలో పార్టీ తరపున ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)ప్రసంగిస్తున్న సమయంలో కొంత అస్వస్థతకు గురికాగా పోడియం వద్ద ఉన్న పార్టీ నాయకులు ఆయనకు సహాయం చేసేందుకు వచ్చారు. కానీ ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. తనకు 83 సంవత్సరాలని.. ఇప్పట్లో నేను చనిపోనన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi)ని గద్దె దించేవరకు జీవించి ఉంటానని గంభీరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జమ్మూ కాశ్మీర్(Jammu kashmir)లో ఎన్నికలు నిర్వహించాలని ఎప్పుడూ కోరుకోలేదు, వారు అనుకొని ఉంటే వారు రెండేళ్లలో దానిని పూర్తి చేసి ఉండేవారు. సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత మాత్రమే ఎన్నికలు జరగాలని, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రిమోట్ కంట్రోల్డ్ ప్రభుత్వాన్ని నడపాలని బీజేపీ భావించింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని యువత కోసం ప్రధాని మోదీ ఏమీ చేయలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. 10 ఏళ్లలో యువత కోసం ఏమీ చేయని బీజేపీ జమ్మూకాశ్మీర్ యువతకు ఏంచేస్తుందో ఆలోచించాలని తెలిపారు.