కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అదానీ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. అదానీ అంశంపై ప్రతిపక్షాల గొంతు నొక్కారని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. అదానీ అంశంపై జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌ను చర్చకు తీసుకురాకుండా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించిందని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గురించి చాలా మాట్లాడుతుంది కానీ.. వారు చెప్పింది పాటించడం లేదు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అదానీ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. అదానీ అంశంపై ప్రతిపక్షాల గొంతు నొక్కారని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. అదానీ అంశంపై జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌ను చర్చకు తీసుకురాకుండా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించిందని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గురించి చాలా మాట్లాడుతుంది కానీ.. వారు చెప్పింది పాటించడం లేదు. 50 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేవలం 12 నిమిషాల్లో ఆమోదించారు. ప్రతిపక్షాలు ఆసక్తి చూపడం లేదని ఆయన ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు.. కానీ ప్రభుత్వం వైపు నుండే అంతరాయం ఏర్పడిందని అన్నారు.
మేం ఏదైనా అంశంపై నోటీసు ఇచ్చి దానిపై చర్చకు డిమాండ్ చేసినప్పుడల్లా మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి.. 52 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. రెండేళ్లుగా అధికార పార్టీ వాళ్లే అడ్డంకులు సృష్టించడం చూస్తున్నామని అన్నారు. మా సమిష్టి సమస్య ఏమిటంటే.. అదానీకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? కేవలం 2.5 ఏళ్లలో అదానీ సంపద 12 లక్షల కోట్లు ఎలా అయింది? ప్రభుత్వ సొమ్మును, ఆస్తులను కొన్నారు. మోదీ జీ ఒక్క వ్యక్తికి మాత్రమే ఇవన్ని ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ కూడా ఇదే ప్రశ్న అడిగారని.. జేపీసీకి ఎందుకు భయపడుతున్నారు?.. అన్ని పత్రాలను తనిఖీ చేసే అవకాశం ప్రతిపక్షాలకు లభిస్తుంది.. పారదర్శకత కొనసాగుతుందని ఖర్గే అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం దానిని ఖండించింది. ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేదు. అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.