రాహుల్ గాంధీ(Rahul Gandhi) బైక్ ర్యాలీలో(Rahul Bike Rally) అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్(Congress) నాయకురాలు కొండా సురేఖకు(Konda Surekha) తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆమె..

Rahul Bike Rally
రాహుల్ గాంధీ(Rahul Gandhi) బైక్ ర్యాలీలో(Rahul Bike Rally) అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్(Congress) నాయకురాలు కొండా సురేఖకు(Konda Surekha) తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆమె.. బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయారు. దీంతో ఆమె తలకు, చేతికి గాయాలయ్యాయి. తక్షణమే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో భాగంగా రెండవ రోజు ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీకి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ఈ యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
