Porsche Car Acident : పోర్షె కారు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం?
పుణే పోర్షే కారు(Porsche Car) ప్రమాదం కేసులో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తున్నది. కారు ప్రమాదంలో నిందితులను తప్పించడానికి ఓ ఎమ్మెల్యే కొడుకు కూడా ప్రయత్నించాడని కాంగ్రెస్ నేత(Congress) నానా పటోలే ఆరోపిస్తున్నారు. పుణే పోర్షే కారు ప్రమాదంలో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం కూడా ఉందని, ఆయనే తెర వెనుక చక్రం తిప్పారని, నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.
పుణే పోర్షే కారు(Porsche Car) ప్రమాదం కేసులో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తున్నది. కారు ప్రమాదంలో నిందితులను తప్పించడానికి ఓ ఎమ్మెల్యే కొడుకు కూడా ప్రయత్నించాడని కాంగ్రెస్ నేత(Congress) నానా పటోలే ఆరోపిస్తున్నారు. పుణే పోర్షే కారు ప్రమాదంలో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం కూడా ఉందని, ఆయనే తెర వెనుక చక్రం తిప్పారని, నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఇదంతా ఆ ఎమ్మెల్యే ద్వారానే జరిగిందంటూ సంచలన కామెంట్లు చేశారు. పబ్‌లో(Pub) నిందితుడు మందు తాగుతున్నప్పుడు అతడితో పాటు మరో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని, వారికి సంబంధించిన వివరాలను కూడా బయటకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వారికి రాజకీయ నాయకుల మద్దతు(Political Background) ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వ తీరును తీవ్ర తప్పుబడుతూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని అన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరో అంశాన్ని గుర్తించారు. ఈ కేసులో భాగంగా మూడు లక్షల రూపాయలకు కక్కుర్తిపడి డాక్టర్లే నిందితుడి రక్తం నమూనాలు మార్చేశారని గుర్తించారు. ఈ మొత్తాన్ని తెచ్చిన ఆసుపత్రి ప్యూన్‌ను అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన రోజు డాక్టర్ తావ్‌రే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి రక్తనమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్ కుదిరిందని పోలీసులు నిర్ధారించారు. నిందితుడైన బాలుడి రక్త నమూనాలకు బదులు వేరే నమూనాలను ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారి డీల్ కుదిరింది. వైద్య పరీక్షల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు బయటపడకూడదనే ఇలా చేశారని పోలీసులు తెలిపారు. కాగా, కాంగ్రెస్ నేత నానా పటోలే చేసిన ఆరోపణలపై మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆసిఫ్ భామ్లా రియాక్టయ్యారు. ఈ కేసులో డాక్టర్లు ఏదైనా అవకతవకలకు పాల్పడినా లేక ఏదైనా తప్పు చేసినా ఎవరినీ విడిచిపెట్టేది లేదన్నారు. ఓ ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌కు వెళితే ఏదో జరిగిందంటూ విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ఇలా మాట్లాడటం మంచిది కాదని భామ్లా అన్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని, సర్కారును ఎవరూ నిందించాల్సిన పని లేదని భామ్లా అన్నారు.